ములుగులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన వీరబాబు కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మలకు పూజలు చేసేందుకు మేడారం వెళ్లారు. మేడారం నుంచి హన్మకొండలో ఇంటికి తిరిగి వస్తుండగా కారు డ్రైవర్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టాడు. కారులో ప్రయాణిస్తున్న భద్రమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించగా, క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Accident: ములుగులో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, 6 మందికి గాయాలు

Road Accident Imresizer