హైదరాబాద్ లో చెత్తవ్యాపారి నుంచి రూ. 1.24కోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇది హవాలా డబ్బుగా పేర్కొన్నారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మాసబ్ ట్యాంకు పరిధిలో షోయబ్ అనే చెత్త వ్యాపారి నుంచి ఈ భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నరారు. షోయబ్ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందినవాడు. హైదరాబాద్ లో పాత సామాన్లు సేకరించే వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే గుజరాత్ కు చెందిన భరత్ అనే వ్యక్తి నుంచి షోయబ్ ఈ నగదును తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.పూర్తి సమాచారంతోనే పోలీసులు షోయబ్ నివాసంలో తనిఖీలు చేపట్టి…రూ. 1.24కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని ఇన్ కంట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Scrap Dealer : చెత్తవ్యాపారి ఇంట్లో రూ.1.25కోట్లు…కంగుతిన్న పోలీసులు…అసలేం జరిగిందంటే..!!

Money