Site icon HashtagU Telugu

Christmas Bonus : క్రిస్మస్‌ బోనస్‌ గా ఉద్యోగులకు ₹80 లక్షలు..!

Australia Christmas Bonus Ren Hart

Ausralia

ఆస్ట్రేలియాలో (Australia) మైనింగ్ మొఘల్‌గా పేరొందిన జార్జినా (గినా) హోప్ రెన్‌ హార్ట్ తమ ఉద్యోగులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. క్రిస్మస్‌ బోనస్‌ (Christmas Bonus) గా ఒక్కొక్కరికి లక్ష డాలర్లు చొప్పున (దాదాపు రూ.80 లక్షలకు పైనే) ఇచ్చి తన పెద్ద మనసుని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని హాన్‌ కాక్‌ ప్రోస్పెక్టింగ్‌ అనే మైనింగ్‌, అగ్రికల్చరల్‌ కంపెనీకి రెన్‌ హార్ట్‌ (Ren Hart) ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌, డైరెక్టర్‌గా ఉన్నారు. 34 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆస్ట్రేలియాలో అత్యంత సంపన్నుల జాబితాలో ఆమె కూడా ఒకరు. తన తండ్రి స్థాపించిన కంపెనీ హాన్‌ కాక్‌ ప్రోస్పెక్టింగ్‌ కు చెందిన రాయ్‌ హిల్‌ అనే మరో సంస్థలో ఉద్యోగులతో ఇటీవల అకస్మాత్తుగా ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పది మంది పేర్లు చదివి వినిపించారు. వారందరికీ లక్ష అమెరికన్‌ డాలర్ల చొప్పున క్రిస్మస్‌ బోనస్‌ (Christmas Bonus) గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆమె ప్రకటనతో ఆ ఉద్యోగులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ బోనస్‌ అందుకున్న ఉద్యోగుల్లో మూడు నెలల క్రితమే ఆ కంపెనీలో చేరిన ఉద్యోగి కూడా ఒకరు ఉన్నారు. గత 12 నెలల కాలంలో ఆ కంపెనీ 3.3 బిలియన్‌ డాలర్ల లాభాల్ని సంపాదించిందని ఆస్ట్రేలియా మీడియా (Australia Media) పేర్కొంది.

Also Read:  Sharmila : నేను అక్కడి నుంచే పోటీ చేస్తా: షర్మిల