మంగ‌ళ‌గిరిలో వైసీపీకి షాక్‌.. టీడీపీలో చేరుతున్న మాజీ మున్సిప‌ల్ ఛైర్మ‌న్‌

మంగ‌ళ‌గిరిలో అధికార వైసీపీకి షాక్ త‌గిలింది. మంగ‌ళ‌గిరి మాజీ మున్సిప‌ల్ ఛైర్మ‌న్ కాండ్రు శ్రీనివాస‌రావు టీడీపీలో

Published By: HashtagU Telugu Desk
Mangalagiri

Mangalagiri

మంగ‌ళ‌గిరిలో అధికార వైసీపీకి షాక్ త‌గిలింది. మంగ‌ళ‌గిరి మాజీ మున్సిప‌ల్ ఛైర్మ‌న్ కాండ్రు శ్రీనివాస‌రావు టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ నారా లోకేష్ స‌మ‌క్షంలో కాండ్రు శ్రీనివాస‌రావు కండువా క‌ప్పుకోనున్నారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆయ‌న పార్టీలోనే కొన‌సాగుతున్నారు. అయినప్పటికీ తనకు వైసీపీలో తగిన గుర్తింపు కానీ, సముచిత స్థానం కానీ లభించలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. కాండ్రు శ్రీనివాసరావు టీడీపీలో చేరుతున్న సందర్భంగా మంగళగిరిలో భారీగా ఫ్లెక్సీలను ఆయ‌న అభిమానులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగిస్తుండ‌టంతో మున్సిపల్ అధికారులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల శైలిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి.

  Last Updated: 17 Jan 2023, 06:50 PM IST