Site icon HashtagU Telugu

Food Poisoning: పెళ్లి వేడుక‌లో భోజ‌నం తిని 12 మంది అస్వ‌స్థ‌త‌..!

Stomach Pain

Stomach Pain

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఓ వివాహ కార్యక్రమంలో ఆహారం తిన్న 12 మంది అస్వస్థతకు గురైయ్యారు. బాధితులు, అంతా శనివారం సాయంత్రం దాబ్రా పట్టణంలోని సివిల్ ఆసుపత్రికి వాంతులు, విరేచనాలతో అడ్మిట్ అయ్యార‌ని గ్వాలియర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మనీష్ శర్మ తెలిపారు. ఛప్రా గ్రామంలో జరిగిన వివాహ కార్యక్రమంలో వీరంతా భోజనం చేశారని అధికారి తెలిపారు. ప్ర‌స్తుతం వీరికి చికిత్స అందిస్తున్నామ‌ని.. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేద‌ని మెడిక‌ల్ ఆఫీస‌ర్ తెలిపారు. పెళ్లిలో భోజనం చేసి మరెవ్వరైనా అస్వస్థతకు గురయ్యారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి వైద్యుల బృందాన్ని ఆదివారం గ్రామానికి పంపినట్లు తెలిపారు.