Site icon HashtagU Telugu

టీకాంగ్రెస్ సోష‌ల్ మీడియా వార్‌రూమ్‌పై పోలీసుల దాడి

Congress Success Secret

Congress Success Secret

తెలంగాణ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్‌పై సైబరాబాద్ పోలీసులు దాడి చేశార‌ని యూత్ కాంగ్రెస్ స‌భ్యులు ఆరోపించారు. కర్నాటక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ అద్భుతంగా ప‌ని చేయ‌డంతో సీఎం కేసీఆర్ ఆందోళన చెందుతున్నార‌ని ఆరోపించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ప్రారంభించారని తెలిపారు. క‌ర్ణాట‌క పీసీసీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా పాత్ర ప్రశంసనీయమైన పని చేసిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆందోళన చెంది ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టార‌ని.. పోలీసులు.. మీ అవినీతి ప్రభుత్వాన్ని బట్టబయలు చేయడంలో ఈ బెదిరింపు వ్యూహాలు మమ్మల్ని అడ్డుకోలేవని ఆయ‌న ట్వీట్ చేశారు.