Suma Kanakala: `జయమ్మ పంచాయతీ` ఏప్రిల్ 22న విడుదల

ప్రముఖ యాంకర్, టెలివిజన్ ప్రెజెంటర్, హోస్ట్ సుమ కనకాల న‌టించిన తాజా చిత్రం `జయమ్మ పంచాయితీ` విడుదల తేదీని

Published By: HashtagU Telugu Desk
Jayamma

Jayamma

ప్రముఖ యాంకర్, టెలివిజన్ ప్రెజెంటర్, హోస్ట్ సుమ కనకాల న‌టించిన తాజా చిత్రం `జయమ్మ పంచాయితీ` విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. సమ్మర్‌లో వచ్చే  సినిమాల‌ను చూసుకుని  చివరకు ఏప్రిల్ 22తో విడుద‌ల‌కు ఫిక్స్ అయినట్టు ఓ ఆహ్లాద‌ర‌క‌ర‌మైన వీడియో ద్వారా వారు తేదీని ప్రకటించారు.  విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ పల్లెటూరి డ్రామా చిత్రం టీజర్, పాటలతో చాలా ఆసక్తిని రేకెత్తించింది. వారు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో ముందుకు రావడం ద్వారా ప్రమోషన్‌లను చేస్తున్నారు.

ఇటీవ‌లే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను కూడా ఆవిష్క‌రించారు. ఎవరికీ, దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా సుమ నటించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, అనూష్ కుమార్ సినిమాటోగ్రాఫర్.

నటీనటులు: సుమ కనకాల

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: విజయ్ కుమార్ కలివరపు

సంగీతం: M.M. కీరవాణి

కెమెరా: అనూష్ కుమార్

ఎడిటర్: రవితేజ గిరిజాల

నిర్మాత: బలగ ప్రకాష్

సమర్పించినవారు: శ్రీమతి. విజయ లక్ష్మి

బ్యానర్: వెన్నెల క్రియేషన్స్

కళ: ధను అంధ్లూరి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అమర్ – అఖిల

పబ్లిసిటీ డిజైన్స్: అనంత్ కంచెర్ల

కాస్ట్యూమ్స్: హరి ప్రియ

PRO: వంశీ-శేఖర్

డిజిటల్ PR: మనోజ్ వల్లూరి

డిజిటల్ ప్రచారాలు: హాష్‌ట్యాగ్ మీడియా

  Last Updated: 14 Mar 2022, 08:16 PM IST