Site icon HashtagU Telugu

New Year: నూతన సంవత్సరాన్ని మొదట ఎక్కడ జరుపుకుంటారో తెలుసా..?

New Year Celebreations

New Year

New Year: 2023 సంవత్సరం మరో నాలుగు రోజుల్లో ముగిసిపోనుంది. అప్పుడే న్యూ ఇయర్ (New Year) వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. అయితే కొత్త సంవత్సరం మొదట, చివరిగా ఎక్కడ జరుపుకుంటారో మీకు తెలుసా. తెలియకుంటే ఈరోజు తెలుసుకుందాం..!

నూతన సంవత్సరాన్ని మొదట ఎక్కడ జరుపుకున్నారు..?

నూతన సంవత్సరాన్ని మొదట ఎక్కడ జరుపుకున్నారో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు.సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం మెసొపొటేమియాలోని బాబిలోన్ నగరంలో మొదటిసారిగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

నూతన సంవత్సరాన్ని మొదట ఎక్కడ జరుపుకుంటారు..?

భూమి గుండ్రంగా ఉంది. అందులో సగం పగలు, మిగిలిన సగం రాత్రి. అందువల్ల న్యూ ఇయర్ జరుపుకునే సమయం కూడా భిన్నంగా ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం.. నూతన సంవత్సరాన్ని మొదట ఓషియానియాలో జరుపుకుంటారు. టోంగా, కిరిబాటి, సమోవా దేశాలలో నూతన సంవత్సరాన్ని ముందుగానే జరుపుకుంటారు. ఈ దేశాల్లో భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 31 మధ్యాహ్నం 3:30 గంటలకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

Also Read: India vs South Africa: తొలిరోజు దక్షిణాఫ్రికాదే.. కుప్పకూలిన టీమిండియా టాపార్డర్

నూతన సంవత్సరాన్ని చివరగా ఎక్కడ జరుపుకుంటారు?

చివరగా న్యూ ఇయర్ అమెరికాకు సమీపంలో ఉన్న జనావాసాలు లేని బేకర్ ద్వీపం, హౌలాండ్‌లో జరుపుకుంటారు. ఇక్కడ భారత కాలమానం ప్రకారం నూతన సంవత్సరం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

కొత్త సంవత్సరం కోసం ప్రజలు ఆసక్తి

కొత్త సంవత్సరం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్‌ని జరుపుకోవడానికి ఎక్కడికో బయటకు వెళ్తారు లేదా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటారు. కొంతమంది విదేశాలకు కూడా వెళ్తుంటారు.