Site icon HashtagU Telugu

Controversial – 2023 : ఈ ఏడాది అత్యంత వివాదాస్పదంగా మారిన అంశాలివీ..

Controversial 2023

Controversial 2023

Controversial – 2023 :  2023 సంవత్సరం కంప్లీట్ కావస్తోంది.  ఈ ఏడాది కొన్ని అంశాలు దేశంలో వివాదాస్పదంగా మారాయి. ఆయా టాపిక్స్‌పై  దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి. యావత్ దేశంలో హాట్ డిబేట్‌కు దారితీసిన ఆయా అంశాలలో కొన్నింటిని మనం నెమరు వేసుకుందాం..

ఇండియా వర్సెస్ భారత్ 

ఈ ఏడాది జీ20 సదస్సు ఇండియా ఆతిథ్యమిచ్చింది. దాని కోసం అతిథులను ఆహ్వానిస్తూ ముద్రించిన ఆహ్వాన పత్రికలో ద్రౌపది ముర్ము హోదాను ‘ఇండియా ప్రెసిడెంట్’కి బదులుగా ‘భారత్ ప్రెసిడెంట్’ అని ప్రస్తావించారు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇండియా పేరును భారత్‌గా మారుస్తారనే ప్రచారం జరిగింది. పార్లమెంటు స్పెషల్ సెషన్‌లో దీనిపై చట్టాన్ని ఆమోదిస్తారనే టాక్ వినిపించింది. చివరకు అలాంటిదేం జరగలేదు. భారత్ అనే పదం గురించి రాజ్యాంగంలో పలుచోట్ల ఇప్పటికే ప్రస్తావన ఉంది. ‘భారత్’ అనే పదానికి దాదాపు 2,000 సంవత్సరాల చరిత్ర ఉందని సంస్కృత గ్రంథాలలో చారిత్రక మూలాలు(Controversial – 2023) ఉన్నాయి.

రెజ్లర్ల నిరసన 

సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా వంటి ఒలింపిక్ పతక విజేతలైన స్టార్ రెజ్లర్లు భారతదేశ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేశారు. బ్రిజ్ భూషణ్‌ను రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ పదవి నుంచి తప్పించాలంటూ ఢిల్లీలో నిరసన దీక్ష నిర్వహించారు. బ్రిజ్ భూషణ్‌పై దాఖలైన ఛార్జ్‌షీట్లలోని వివరాలు కలకలం రేపాయి. బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్‌‌పై చర్యలు మొదలుకావడానికి  చాలా టైం పట్టింది. ఈనెల 21న భారతదేశ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది.

‘ది కేరళ స్టోరీ’

‘ది కేరళ స్టోరీ’ మూవీ వివాదాన్ని క్రియేట్ చేసింది. బలవంతపు మత మార్పిడులపై ఈ మూవీ చర్చించింది. కేరళలో దాదాపు 32వేల మంది మహిళలను ఇస్లాం మతంలోకి మార్చారని, కొంతమంది మహిళలను సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద గ్రూపులో కూడా చేర్పించారనే కోణంలో ఇందులో కథను చూపించారు.  ఇందులో అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ నటించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత నిరసనలు చెలరేగాయి. వివాదం ఉన్నప్పటికీ.. ఈ సినిమా విడుదలను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ సినిమాలో ద్వేషపూరిత ప్రసంగం లేదని పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

బీబీసీ డాక్యుమెంటరీ 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదానికి తెరతీసింది. జనవరి 17, జనవరి 24 తేదీల్లో రెండు భాగాలుగా విడుదలైన ఈ డాక్యుమెంటరీ ఆ తరువాత నిషేధాన్ని ఎదుర్కొంది. దీనిపై ప్రతిపక్షాలు పార్లమెంటులో ఆందోళనలు చేశాయి. భారత్‌లో బీబీసీపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వివిధ ప్రాంతాల్లో డాక్యుమెంటరీని ప్రదర్శించారని అరెస్టులు చేశారు. 2002లో గుజరాత్‌లో జరిగిన ముస్లిం వ్యతిరేక అల్లర్లను హైలైట్ చేస్తూ  ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.

డీప్‌ఫేక్ 

ఏఐ టెక్నాలజీని వాడి ఓ యువతి ముఖాన్ని  రష్మిక మందన్న ముఖంలా మార్చారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. ఆ తరువాత కాజోల్, కత్రినా కైఫ్ ఫొటోలను కూడా ఇలాగే మార్చారు. దీనిపై చివరకు కేంద్రమంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా ఎంతో మంది ప్రముఖులు స్పందించారు. దీంతో డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోల తయారీపై సోషల్ మీడియా సంస్థలకు కేంద్ర సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది.

Also Read: Pannun Vs Nikhil : పన్నూ హత్యకు కుట్ర కేసు.. సుప్రీంకోర్టుకు నిఖిల్ ఫ్యామిలీ.. ఎవరీ నిఖిల్ ?