AI Resume : రెజ్యూమె తయారీకి 6 జబర్దస్త్ ఏఐ టూల్స్

AI Resume : ఏఐ టూల్స్‌ కాలం ఇది. ప్రభావవంతమైన రెజ్యూమె తయారు చేయడానికి కూడా మీరు వాటిని వాడుకోవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Ai Resume

Ai Resume

AI Resume : ఏఐ టూల్స్‌ కాలం ఇది. ప్రభావవంతమైన రెజ్యూమె తయారు చేయడానికి కూడా మీరు వాటిని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ది బెస్ట్  ‘ఏఐ రెజ్యుమె తయారీ టూల్స్‌’ను పరిచయం చేసుకుందాం. వీటిని వాడుకొని తయారు చేసే రెజ్యూమె.. ఉద్యోగ వేటలో అదనపు బలంగా మారుతుంది. ఏఐ టూల్స్ మీ రెజ్యూమెకు క్రియేటివిటీని యాడ్ చేస్తాయి. మీ వ్యక్తిగత వివరాలు, మీ నైపుణ్యాలు, అనుభవాలు, ప్రత్యేకతల వివరాలను చక్కగా ప్రజెంట్ చేసేందుకు దోహదం చేస్తాయి.

We’re now on WhatsApp. Click to Join.

  • resume.io  తో మీరు  ది బెస్ట్ రెజ్యూమె తయారు చేయొచ్చు. దీనితో నిమిషాల వ్యవధిలో వేగంగా ప్రొఫెషనల్‌ సీవీని రెడీ చేయొచ్చు. దీనిలో రెజ్యూమెకు సంబంధించిన చాలా టెంప్లేట్లు అందుబాటులో ఉంటాయి.మనం నచ్చిన టెంప్లేట్‌తో సీవీ తయారీని మొదలుపెట్టొచ్చు. కవర్‌ లెటర్లు కూడా రకరకాల టెంప్లేట్లతో ఇక్కడ ఉచితంగా లభిస్తాయి. రెజ్యూమె రెడీ అయ్యాక.. ఎంఎస్ వర్డ్‌ లేదా పీడీఎఫ్‌ డాక్యుమెంట్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. స్పెల్లింగ్‌ చెక్‌ కూడా ఇందులో ఆటోమేటిక్‌గా జరిగినపోతుంది.
  • resumaker.ai తో మీరు చక్కని సీవీని తయారు చేయొచ్చు.  ప్రొఫెషనల్‌ రెజ్యూమె టెంప్ల్లేట్స్‌ ఇందులో ఉన్నాయి. ఇక్కడ మనం సేవ్ చేసే సమాచారం ఎవరూ వాడి దుర్వినియోగం చేయకుండా ఇందులో డేటా ఎన్‌క్రిప్షన్‌ సదుపాయం ఉంది.
  • rezi.ai  తో మీరు ఈజీగా రెజ్యూమె రెడీ చేయొచ్చు. సాఫ్ట్‌వేర్‌ వినియోగంపై అవగాహన లేని వాళ్లకు ఇది చాలా హెల్ప్ ఫుల్‌గా ఉంటుంది. ఇది ఏఐ జీపీటీతో పనిచేస్తుంది. ఇది ఏదైనా విషయాన్ని బుల్లెట్‌ పాయింట్ల రూపంలో డివైడ్ చేస్తుంది.
  • kickresume.com  తో మీరు రెజ్యూమెను తడబడకుండా తయారు చేయొచ్చు. ఎందుకంటే ఇందులో 20 వేలకుపైగా రెజ్యూమే సంబంధిత వాక్యాలు రెడీగా ఉన్నాయి. వీటిని మీ అవసరానికి తగిన విధంగా వాడుకోవచ్చు. ఇది జీపీటీ-4 ద్వారా పనిచేస్తుంది.
  • designs.ai తో మీరు వెయ్యికి పైగా రెజ్యూమె  టెంప్లేట్స్‌‌ను వాడుకోవచ్చు. మీరు ఏ పరిశ్రమలో జాబ్‌కు అప్లై చేయాలని భావిస్తున్నారో ఆ పరిశ్రమకు తగిన మూడ్‌తో కూడిన టెంప్లేట్స్ ఇందులో లభిస్తాయి. దీనిలో వెయ్యికి పైగా రెజ్యూమె టెంప్లేట్స్‌ ఉన్నాయి.
  • canva.com తో మీరు మీ జాబ్ ప్రొఫైల్‌కు తగిన రెజ్యూమె టెంప్లేట్‌ను పొందొచ్చు. అనంతరం దాన్ని మీ అవసరానికి తగిన విధంగా మార్చుకోవచ్చు కూడా.. రంగు, ఫాంట్‌, లేఅవుట్‌ అన్నీ ఛేంజ్ చేసి, గ్రాఫిక్స్‌ ఎఫెక్ట్స్‌ను యాడ్ చేయొచ్చు.

Also Read: IRCTC Room 100 : రైల్వే స్టేషన్‌లో రూమ్.. 100 రూపాయలే

  Last Updated: 04 Nov 2023, 03:41 PM IST