World Water Day 2024 : జలం ఉంటేనే జనం.. ‘బెంగళూరు సంక్షోభం’ నేర్పుతున్నది అదే!

World Water Day 2024 : మార్చి 22.. ఇవాళ ప్రపంచ జల దినోత్సవం!! నీటి ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే రోజు ఇది.

  • Written By:
  • Updated On - March 22, 2024 / 08:51 AM IST

World Water Day 2024 : మార్చి 22.. ఇవాళ ప్రపంచ జల దినోత్సవం!! నీటి ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే రోజు ఇది. ఈ సంవత్సరం ఐటీ హబ్ బెంగళూరులో నీటి సంక్షోభాన్ని మనం కళ్లారా చూశాం. ఇప్పటికైనా మనం నీటి విలువను గుర్తించాలి. దాన్ని వేస్ట్ చేయకూడదు. నీటి పొదుపునకు అవసరమైన అన్ని మార్గాలను అనుసరించాలి. ఈదిశగా ప్రజలను చైతన్యంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join

1992లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ, అభివృద్ధి సదస్సులో ఎజెండా 21 కింద ప్రపంచ జలదినోత్సవాన్ని అధికారికంగా ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1992 డిసెంబరులో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీని ద్వారా మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా(World Water Day 2024) ప్రకటించారు. మంచి నీటి వనరుల సుస్థిర నిర్వహణపై ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ రోజును జరుపుకుంటోంది. ఈ ఏడాది వరల్డ్ వాటర్ డే కోసం ‘‘సమృద్ధి, శాంతి కోసం నీరు’’. ప్రతి సంవత్సరం ఈ థీమ్ మారుతుంటుంది. ఈ ఏడాది ఎంచుకున్న వాటర్ డే థీమ్‌లోకి వెళితే..  శాంతిని చేకూర్చగలిగే శక్తి, విధ్వంసాన్ని సృష్టించగలిగే సామర్థ్యం నీటికి ఉంటుంది. నీటి కొరత ఏర్పడినప్పుడు లేదా నీరు కలుషితమైనప్పుడు లేదా ప్రజలు నీటి కోసం పోరాడుతున్నప్పుడు సమాజాలలో ఉద్రిక్తతలు తలెత్తుతాయి అనేదే ఈ థీమ్ ద్వారా చెప్పదలిచారు.

నీటిని ల్యాబ్‌లో తయారు చేయొచ్చా ?

ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు నీటి కొరతతో సతమతం అవుతున్నాయి. ౌకొందరు అతిగా భూముల్ని తవ్వటం ఒక కారణమైతే, కాలుష్యం కారణంగా మరి కొన్ని ప్రాంతాలు తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో స్థిరమైన వర్షపాతం లేక నీటి కరువు వస్తోంది. వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైన దీర్ఘకాలిక కరువులతో ఎందరో పోరాడుతున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం, తగిన చర్యలు తీసుకోకపోతే 2050 నాటికి, నీటి కొరత వల్ల ప్రజలు ఘోరమైన నీటి కరువు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మరి సాంకేతిక పరిజ్ఞానం ఇంత పెరిగినప్పటికీ, నీటి కెమికల్ ఫార్ములా తెలిసినప్పటికీ ఈ నీటి కొరత నుంచి విముక్తి పొందటానికి కృత్రిమ నీటిని ఎందుకు తయారుచేయలేకపోతున్నారు? నీటి (H2O) కెమికల్ ఫార్ములా మనకు తెలిసినప్పటికీ, ప్రయోగశాలలో నీటిని సృష్టించడం కోసం హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులను కలపాల్సి ఉంటుంది. అది అంత సులభం కాదు. నీటి ఫార్ములా మనకు తెలుసుగానీ, ప్రయోగశాల వంటి నియంత్రిత వాతావరణంలో ఉత్పత్తి చేసే పద్ధతులను కలిగి ఉన్నప్పటికీ.. ల్యాబ్‌లో అంత భారీ మొత్తంలో నీటి ఉత్పత్తి సాధ్యమయ్యే విషయం కాదు.  నదులు, సరస్సులు లేదా డీశాలినేషన్ వంటి సహజ వనరుల నుంచి మనకు అన్ లిమిటెడ్‌గా నీరు లభిస్తుంటుంది. పైగా, ల్యాబ్‌లో ఉత్పత్తి చేసే నీరు వివిధ అనువర్తనాల కోసం స్వచ్ఛత, భద్రతా ప్రమాణాలను కలిగి ఉండాలి.

Also Read: Pig Kidney : తొలిసారిగా మనిషికి పంది కిడ్నీ.. ఎందుకు ?