World Toilet Day : టాయిలెట్ల సంక్షోభం సమసిపోయేనా ?

World Toilet Day : నవంబరు 19న (ఆదివారం)  మనం ‘వరల్డ్ టాయిలెట్ డే’ జరుపుకుంటాం.

Published By: HashtagU Telugu Desk
World Toilet Day

World Toilet Day

World Toilet Day : నవంబరు 19న (ఆదివారం)  మనం ‘వరల్డ్ టాయిలెట్ డే’ జరుపుకుంటాం. 2001లో సింగపూర్‌‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్’ నవంబర్ 19ని వరల్డ్ టాయిలెట్ డేగా ప్రకటించింది. అయితే 2010లో నీరు, పారిశుద్ధ్యం అనే అంశాలను ప్రాథమిక మానవ హక్కులుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించినప్పుడు ‘ప్రపంచ టాయిలెట్ దినోత్సవం’ అనేది తెరపైకి వచ్చింది. దాని ప్రాధాన్యత పెరిగింది. ఈసందర్భంగా మనం చరిత్ర గురించి కాకుండా.. ప్రస్తుతం ఒక దేశంలో నడుస్తున్న టాయిలెట్ల సంక్షోభం గురించి(World Toilet Day) తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

50వేల మందికి నాలుగు టాయిలెట్లే.. 

పాలస్తీనాలో రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి వెస్ట్ బ్యాంక్. మరొకటి గాజా. గాజా ప్రాంతం ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాల పక్కనే ఉంటుంది. అందుకే అక్కడ నిత్యం టెన్షన్ ఉంటుంది. అక్కడ అక్టోబరు 7 నుంచి యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలో జనజీవనం అతలాకుతలమైంది. దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలో 50వేల మంది ప్రజలకు సగటున నాలుగు టాయిలెట్లే అందుబాటులో ఉన్నాయి. దీన్నిబట్టి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

టాయిలెట్ల కంటే సెల్‌ఫోన్లే ఎక్కువ.. 

ఇక మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సెల్‌ఫోన్లు ఎక్కువగా, టాయిలెట్లు తక్కువగా ఉన్నాయి. సెల్ ఫోన్ వాడుతున్న చాలా ఇళ్లలో టాయిలెట్లు లేని పరిస్థితులు సైతం ఉన్నాయి. టాయిలెట్లు లేని ఇళ్లు జార్ఖండ్‌, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల్లోనైతే సగటున ప్రతి 100 ఇళ్లకుగానూ  సగటున 70 ఇళ్లలో టాయిలెట్లు లేవు. కానీ సెల్ ఫోన్లు మాత్రం ఉన్నాయి. నేటికీ  మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలా ఇళ్లలో టాయిలెట్లు లేక.. స్త్రీలు బహిర్భూమి కోసం తెల్లవారుజామునే ఊరికి దూరంగా వెళ్లాల్సి వస్తుండటం బాధాకరమైన అంశం. ఇప్పటికీ మన దేశంలో 29 శాతం మంది బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తున్నారు. ప్రతి 100 మంది జనాభాకు కనీసం 6 టాయిలెట్లు ఉండాలని అంతర్జాతీయ ప్రమాణాలు చెబుతున్నాయి. వాటిని చేరుకోవాలంటే పేదలకు టాయిలెట్లను నిర్మించి ఇచ్చే ప్రభుత్వ పథకాల అమలు మరింత పెరగాలి. ఇక ఇంట్లో టాయిలెట్ ఉన్నవాళ్లు దాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి.  ఇల్లు శుభ్రంగా ఉండటం ఎంత ముఖ్యమో టాయిలెట్‌ శుభ్రంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి.

Also Read: Gold- Silver Price: ఈరోజు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్న బంగారం ధరలు..!

  Last Updated: 18 Nov 2023, 07:32 AM IST