World Organ Donation Day: నేడు ప్రపంచ అవయవ దాన దినోత్సవం.. ఈ రోజు ప్రత్యేకతలు ఏంటంటే..?

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా (World Organ Donation Day) నిర్వహిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 13, 2023 / 11:42 AM IST

World Organ Donation Day: ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా (World Organ Donation Day) నిర్వహిస్తున్నారు. ఇది అవయవ దానం ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి ఉద్దేశించిన గ్లోబల్ ప్రోగ్రామ్. ఇది కాకుండా అవయవ దానం ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడానికి కూడా ఈ రోజును జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలకు అవయవ దాన ప్రక్రియ గురించి అవగాహన కల్పిస్తారు. ఈ రోజు చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

ప్రపంచ అవయవ దాన దినోత్సవం 2023: చరిత్ర, ప్రాముఖ్యత

అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఈ రోజు సరైన అవకాశం. ఇది కాకుండా అవయవ దానం ప్రక్రియకు సంబంధించిన అపోహలను తొలగించడంలో కూడా ఈ రోజు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అవయవ దానం వల్ల నిరుపేద వ్యక్తి ప్రాణాలను కాపాడి, అతనికి కొత్త జీవితాన్ని అందించవచ్చని గమనించాలి. ఒక అవయవ దాత దాదాపు ఏడుగురి ప్రాణాలను కాపాడగలరు. కావున ప్రతి ఒక్కరు ఈ రోజును జరుపుకొని దాని ప్రాముఖ్యతను ఇతరులకు వివరించి అవగాహన కల్పించాలి.

Also Read: Mahatma Gandhi – 1947 August 15th : 1947 ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా గాంధీ ఏం చేశారంటే ?

ప్రపంచ అవయవ దాన దినోత్సవం 2023: థీమ్

ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం విభిన్న థీమ్‌తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రపంచ అవయవ దాన దినోత్సవం 2023 థీమ్ “అవయవాలను దానం చేయండి, ప్రాణాలను కాపాడండి”. అవయవ దానం కోసం ప్రజలకు ప్రపంచవ్యాప్త విజ్ఞప్తిని చేయడం ఈ థీమ్ లక్ష్యం. అవయవ దానం గురించి మన చుట్టూ ఉన్న అపోహలను తొలగించే అవకాశాన్ని కల్పించడం కోసం ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అవయవ దానం ప్రాముఖ్యత గురించి మనం అవగాహన పెంచుకోవాలి. లక్షలాది మంది జీవితాలను ఎలా రక్షించగలదో ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలి.