Site icon HashtagU Telugu

World Lion Day: నేడు సింహాల దినోత్సవం.. ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుకోవడం ఎందుకు ముఖ్యం..?

World Lion Day

Biparjoy 100 Lions 

World Lion Day: ప్రతి సంవత్సరం ఆగస్టు 10ని ప్రపంచ సింహాల దినోత్సవం (World Lion Day)గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. సింహాల సంరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ముఖ్య ఉద్దేశ్యం. మన పర్యావరణ వ్యవస్థకు సింహాలు చాలా ముఖ్యమైనవని జంతు కార్యకర్తలు నమ్ముతారు. ఆసియాలో అత్యధిక సింహాలు భారతదేశంలోనే కనిపిస్తాయి. భారతదేశంలో కనిపించే అతిపెద్ద జాతులలో ఆసియా సింహం ఒకటి. ఇది కాకుండా మిగిలిన నాలుగు రాయల్ బెంగాల్ టైగర్, ఇండియన్ చిరుత, క్లౌడెడ్ చిరుత, మంచు చిరుత.

ప్రపంచ సింహాల దినోత్సవం చరిత్ర

మొదటిసారిగా 2013లో ప్రపంచ సింహాల దినోత్సవాన్ని బిగ్ క్యాట్ రెస్క్యూ ప్రారంభించింది. ఇది సింహాలకు అంకితమైన ప్రపంచంలోనే అతిపెద్ద అభయారణ్యం. దీనిని డెరెక్, బెవర్లీ జౌబెర్ట్ అనే భార్యాభర్తలు కలిసి స్థాపించారు. అతను అడవిలో నివసించే సింహాలను రక్షించడానికి నేషనల్ జియోగ్రాఫిక్, బిగ్ క్యాట్ ఇనిషియేటివ్ రెండింటినీ ఒకే బ్యానర్‌పైకి తీసుకురావడానికి చొరవను ప్రారంభించాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

సింహాల దినోత్సవాన్ని జరుపుకోవడం ఎందుకు ముఖ్యం?

సింహాల పరిరక్షణ గురించి చెప్పడం, అందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడం. అవగాహన లోపం వల్ల సింహాల సంఖ్య తగ్గిపోతోంది. అందువల్ల వాటి రక్షణ తక్షణ అవసరం. పర్యావరణ వ్యవస్థలో సింహాల ప్రాముఖ్యత, వాటి సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజు లక్ష్యం.

Also Read: Fruit Prices: టమాటాలు, ఉల్లిగడ్డలు తర్వాత సామాన్యులకు షాక్ ఇవ్వనున్న పండ్ల ధరలు..?!

సింహం గురించి ముఖ్యమైన సమాచారం

– మగ సింహాలు 190 కేజీల దాకా బరువు పెరుగుతాయి. ఆడ సింహాలు 116 కేజీల దాకా బరువు పెరగగలవు.

– సింహాల కండరాలు బలంగా ఉంటాయి. సింహం పంజా దెబ్బ నుంచి తప్పించుకోవడం కష్టం.

– ఆఫ్రికా సింహాల తర్వాత.. ఆసియా సింహాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇవి గుజరాత్ లోని గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్కులో ఉన్నాయి.

– సింహాలు నీరు అంతగా లేని కలహారీ ఎడారి లాంటి ప్రాంతాల్లో కూడా జీవించగలవు. అవి నీటిని ఇతర జంతువుల నుంచి పొందుతాయి. లేదా సమ్మా మెలన్ లాంటి మొక్కల నుంచి పొందగలవు.

– సింహాలు ఒకసారి భోజనం చేస్తే 40 కేజీల మాంసాన్ని తినగలవు. అంటే తమ శరీరంలో 25 శాతం బరువున్న ఆహారాన్ని తినగలవు.

– సింహాలు చీకట్లోనూ చూడగలవు. అందుకే రాత్రివేళ వేటాడతాయి.

Exit mobile version