World Dreams Day : కలలు కనండి.. జీవితం మార్చుకోండి..

World Dreams Day :  ‘‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’’ అని ఏపీజే అబ్దుల్ కలామ్ అన్నారు.

Published By: HashtagU Telugu Desk
World Dreams Day

World Dreams Day

World Dreams Day :  ‘‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’’ అని ఏపీజే అబ్దుల్ కలామ్ అన్నారు. కలలు గనడం మనిషి నైజం. నిద్రలో మనకు ఎన్నో కలలు వస్తుంటాయి. ఆ కలల్ని మనం ఆపలేం. మన ఆలోచనలు, మన విజన్ ను బట్టి వచ్చే కలలు ఉంటాయి. కొన్ని కలలను మనం అర్థం చేసుకుంటాం. ఇంకొన్ని కలలు మిస్టరీగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోలేక వదిలేస్తాం. ఈ కలలను కూడా జీవితంలో మైలురాయిగా మార్చుకోవాలి. పాజిటివ్ సైన్స్ తో వచ్చే కలలను జీవితంలో విజయానికి బాటలుగా వేసుకోవాలి. రాబోయే విజయం కోసం చెమట చిందించి కష్టించాలి. మానవ జీవితంలో ఎంతో విలువైన కలలను సెలబ్రేట్ చేసుకునేందుకు కూడా ఒక రోజు ఉంది.  అదే సెప్టెంబరు 25. 2012 సెప్టెంబర్‌ 25న అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన విద్యావేత్త ఓజియోమా ఎగ్వున్‌వు  ‘ప్రపంచ కలల దినోత్సవం’ వేడుకలను ఆ విశ్వవిద్యాలయంలో తొలిసారి (World Dreams Day) ప్రారంభించారు.

Also read : Bigg Boss 7 : వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందా లేదా..?

ఈరోజు ఏం చేయాలి ?

  • ఎవరు ఏ వయసులో ఉన్నా తమ కలల గురించి ఈరోజున ఒక డైరీలో రాయండి.
  • కన్న కలలు ఏమిటో, నెరవేరని కలలు ఏమిటో ఓ జాబితా రాసుకోండి. ఈ కలల సాకారం కోసం ఇన్నాళ్ళు ఏం చేశారో ఒకసారి ఆలోచించండి.
  • కలలు వాస్తవరూపం దాల్చడానికి తగిన ప్రణాళిక రూపొందించుకోండి. ఆచరణలో అమలు చేయడానికి గల సకల అవకాశాల్ని చూడాలి.
  • మీరు ఎవరు.. మీరు ఎక్కడ నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. కలలు కనడం చాలా ముఖ్యం.
  • కలలు మీ ఆలోచనలను మారుస్తాయి. మీ  కృషిని కొత్త పుంతలు తొక్కిస్తాయి.
  • మీరు కంటున్న కలను సాధించే దిశగా ప్రతిరోజూ ఒక అడుగు ముందుకు వేయండి. ఎంత చిన్న అడుగు వేసినా దానిపై పని చేయడం ద్వారా మీ కలకి దగ్గరవుతారని గుర్తుంచుకోండి.
  • నెగెటివ్ ఆలోచనలను రానివ్వకండి. నెగెటివ్ గా మాట్లాడే వాళ్లను పట్టించుకోకండి.
  Last Updated: 25 Sep 2023, 11:26 AM IST