World Diabetes Day 2024 : ఇవాళ (నవంబరు 14) ప్రపంచ డయాబెటిస్ దినం. డయాబెటిస్‌నే షుగర్ వ్యాధి అని కూడా పిలుస్తాం. దీన్నే మధుమేహం అని కూడా అంటారు. నిత్యం ఎంతోమంది షుగర్ వ్యాధి బారినపడుతున్నాారు. షుగర్ రోగుల సంఖ్య మన దేశంలో నానాటికీ పెరుగుతూపోతోంది. ఈరోజు షుగర్ వ్యాధి చికిత్సతో ముడిపడిన కీలక సమాచారాన్ని తెలుసుకుందాం..
Also Read :Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
మన దేశంలోని డయాబెటిస్ బాధితులకు ఆ వ్యాధి ఉందనే విషయం చాలా ఆలస్యంగా తెలుస్తోంది. దీనివల్ల వారి రిస్క్ లెవల్స్ పెరిగి పోతున్నాయి. డయాబెటిస్ లక్షణాలపై ప్రజలకు అంతగా అవగాహన లేకపోవడం వల్ల కూడా.. దాన్ని త్వరగా గుర్తించలేకపోతున్నారు.కొందరు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వేళ్లు, పాదాల కణజాలం చచ్చుబడుతుంది. దీన్నే గ్యాంగ్రీన్ అని పిలుస్తారు. గాఢ నిద్రలో కాసేపు ఊపిరి ఆగినట్టు అవుతుంది. అరికాళ్లలో మంట, పాదాల్లో తిమ్మిర్లు, నొప్పుల వంటి సమస్యలు ఇంకొందరు షుగర్ రోగుల్లో బయటపడుతుంటాయి. మధుమేహం తీవ్రరూపు దాలిస్తే కొందరిలో గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధి, పక్షవాతం, కాలేయ క్యాన్సర్ వంటివి వస్తుంటాయి.
Also Read :Prasar Bharati OTT : 20న ‘ప్రసార భారతి ఓటీటీ’ విడుదల.. ఎలాంటి కంటెంట్ ఉంటుందంటే..
పెద్ద రక్తనాళాలు గుండె, మెదడు, కాళ్ళలో ఉంటాయి. సూక్ష్మ రక్తనాళాలు మూత్రపిండాలు, కళ్లతో పాటు అన్ని అవయవాల్లో ఉంటాయి. షుగర్ వ్యాధి తొలిసారి నిర్ధారణ అయిన వారిలో పెద్ద రక్తనాళాలు దెబ్బతిన్నాయా ? సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిన్నాయా ? అనేది గుర్తిస్తారు.ఈ ముప్పు ఉన్నవాళ్లకు జీఎల్‌పీ (గ్లూకగాన్ లైక్ ప్రొటీన్), గ్లిఫ్లోజిన్ మందులను వెంటనే ఆరంభించాలని సూచిస్తుంటారు. వీటితో పాటు గ్లూకోజు, బరువు తగ్గించటానికీ మందులను ఇస్తారు. షుగర్ వల్ల పెద్ద రక్తనాళాల సమస్యలు తలెత్తిన వారికి.. వ్యాధి తీవ్రతను బట్టి జీఎల్‌పీ ఇంజెక్షన్లు వేసుకోవాలని వైద్యులు సిఫారసు చేసే ఛాన్స్ ఉంటుంది. మూత్రపిండాల్లోని రక్తనాళాలు దెబ్బతినటం వల్ల వడపోత సామర్థ్యం (జీఎఫ్‌ఆర్) నిమిషానికి 60 మి.లీ. కన్నా తక్కువకు పడిపోతుంది. మూత్రంలోని సుద్ద 30 మి.గ్రా. కన్నా ఎక్కువగా బయటకు పోతుంది. మన దేశంలో చాలాకాలంగా వినియోగంలో ఉన్న గ్లిప్టిన్లు, మెట్‌ఫార్మిన్ మందులతో బరువు అంతగా తగ్గదని వైద్య నిపుణులు(World Diabetes Day 2024) అంటున్నారు. ఈ మందులను వాడుతూనే ఆహార, వ్యాయామ నియమాలు పాటించాలని చెబుతున్నారు.