ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఇష్టపడే మరియు ప్రతి బైట్‌లోనూ ఓ ఎమోషన్‌గా భావించే ఆహారం – బిర్యానీ (Biryani). ప్రతి ఏడాది జూలై నెలలో తొలి ఆదివారంని ‘వరల్డ్ బిర్యానీ డే’(World Biryani Day)గా జరుపుకుంటున్న విషయం చాలామందికి కొత్తగానే ఉంటుంది. బిర్యానీకి ఉన్న క్రేజ్, ప్రాచుర్యం దృష్ట్యా దీనికో ప్రత్యేక దినోత్సవం ఏర్పాటు చేయడం ఆశ్చర్యం కాదు. హోటల్‌లు, ఫుడ్ డెలివరీ యాప్‌లు ఈ రోజున ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ బిర్యానీ ప్రియులకు పండుగ వాతావరణం తీసుకొస్తున్నాయి.
Agniveer Notification : అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల
బిర్యానీ అనే పదం పర్షియన్ మూలాలను కలిగి ఉంది. ఇది పర్షియా (ఇప్పటి ఇరాన్) నుంచి వ్యాప్తి చెంది, మొఘల్ రాజవంశం ద్వారా భారత్‌కి చేరింది అని చరిత్రకారులు చెబుతున్నారు. మొఘల్ కళా సంపదతో పాటు వారి వంటకాల రుచులు కూడా భారతీయ సంస్కృతిలో కలిసి పోయాయి. అనంతరం భారతదేశంలో ఈ వంటకం స్థానికంగా విస్తరిస్తూ హైదరాబాదీ బిర్యానీ, లక్నో (అవధీ) బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ వంటి అనేక వేరియంట్లుగా రూపాంతరం చెందింది.
మన ప్రాంతీయ సంస్కృతి ప్రకారంగా కూడా బిర్యానీకి చక్కటి స్వభావం ఏర్పడింది. హైదరాబాదీ దమ్ బిర్యానీతో పాటు, ఉలవచారు బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, బాన్సా బిర్యానీ, చికెన్ 65 బిర్యానీ వంటి ఎన్నో దేశీ వేరియంట్లు జన్మించాయి. ఈరోజు బిర్యానీ కేవలం వంటకంగా కాకుండా, ఒక ఆహార సంస్కృతిగా, స్నేహితులతో పంచుకునే పండుగలా, ఇంకా సాంస్కృతిక గుర్తింపుగా నిలిచింది. అందుకే బిర్యానీ డేను ప్రత్యేకంగా జరుపుకుంటూ, ఈ రుచికర వంటకానికి గౌరవం ఇవ్వడం ఆనందకరమైన విషయం.