World Animal Day 2023 : నేడు ప్రపంచ జంతు దినోత్సవం..ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా..?

ఈ ఏడాది (2023 ) ప్రపంచ జంతు దినోత్సవం థీమ్ “ఎ షేర్డ్ ప్లానెట్”. ఈ ప్రపంచం మానవులకే కాకుండా ప్రతి జీవికి చెందినదని తెలుపుతుంది. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఈ ప్రపంచ జంతు దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Published By: HashtagU Telugu Desk
World Animal Day 2023

World Animal Day 2023

నేడు ప్రపంచ జంతు దినోత్సవం (World Animal Day 2023) : ఈ భూమిమీద ఎన్నో రకాలైన జంతువులు మనుషులతో పాటు జీవిస్తున్న సంగతి తెలిసిందే. మనుషుల కంటే ముందే ఈ భూమి మీద జంతువులు అడుగుపెట్టాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే నేటి ఆధునిక యుగంలో అనేక జంతువులు అంతరించిపోతున్నాయి.

ఇలాంటి జంతువులు అంతరించకుండా పోకుండా వాటిని సంరక్షిడమే ఏకైక లక్ష్యంగా ప్రపంచ జంతు దినోత్సవాన్ని ప్రతి యేటా అక్టోబర్ 04 న ప్రపంచ జంతు దినోత్సవంగా (World Animal Day 2023) నిర్వహిస్తుంటారు. ఈ రోజు సాధారణంగా అంతరించిపోతున్న జాతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా వాటిని ఎలా కాపాడుకోవాలో తెలుపుతారు. ఈ ప్రపంచ జంతు దినోత్సవాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ ప్రపంచ జంతు దినోత్సవ చరిత్ర (World Animal Day History) చూస్తే..

ప్రపంచ జంతు దినోత్సవం 1925లో ప్రారంభమైంది. సైనోలజిస్ట్ హెన్రిచ్ జిమ్మర్‌మాన్ మొదటి కార్యక్రమాన్ని మార్చి 24 న బెర్లిన్‌లోని స్పోర్ట్ ప్యాలెస్‌లో నిర్వహించారు. తొలిసారి ఈ కార్యక్రమానికి 5,000 మందికి పైగా హాజరయ్యారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని జంతువుల సంస్థలను, జంతు ప్రేమికులను ఏకం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.

ప్రపంచ జంతు దినోత్సవ (World Animal Day Prominence) ప్రాముఖ్యత :

ప్రపంచ జంతు దినోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జంతువుల సంరక్షణ పట్ల సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించడం, జంతు సంరక్షణ ప్రాముఖ్యత తెలియజేయడంలో ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. చెట్లు నరికివేయడం, అడవుల విస్తీర్ణం తగ్గడం ద్వారా జంతువులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వీటిని అరికట్టాలంటే ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన జంతు నియంత్రణ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరం.

ప్రపంచ జంతు దినోత్సవం (Aims of World Animal Day) లక్ష్యాలు :

మనం జంతువుల ఆవాసాలను నాశనం చేస్తున్నాం. విచక్షణారహితంగా అడవులు నరుకుతూ వాటి తావులను, మంచినీటి వనరులను ధ్వంసం చేస్తున్నాం. అందుకే అడవి జంతువులు గ్రామాల్లొకీ, పట్టణాల్లోకి వస్తున్నాయి. ఆహారం కోసం మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిని మార్చడం కూడా ఈ జంతు దినోత్సవం లక్ష్యాల్లో ఒకటి. జంతువులకు సహజసిద్ధమైన ఆవాసాలను కల్పించడం, జంతు జాతులను రక్షించడం, వాటి సంక్షేమాన్ని కాపాడటం ఇవే ప్రధానం.

ఇక ఈ ఏడాది (2023 ) ప్రపంచ జంతు దినోత్సవం థీమ్ (World Animal Day 2023 Theme) “ఎ షేర్డ్ ప్లానెట్”. ఈ ప్రపంచం మానవులకే కాకుండా ప్రతి జీవికి చెందినదని తెలుపుతుంది. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఈ ప్రపంచ జంతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయత, మతం, విశ్వాసం, రాజకీయ భావజాలంతో సంబంధం లేకుండా, అన్ని దేశాలు తమదైన రీతిలో జరుపుకుంటాయి.

  Last Updated: 04 Oct 2023, 11:17 AM IST