Anaesthesia Day 2024 : ఆపరేషన్ అంటే.. ఒకప్పుడు నరకం. రోగి చూస్తుండగానే.. సర్జరీ కానిచ్చేవారు. ఆ టైంలో రోగి ఎంతగా బాధపడేవాడో మనం ఊహించుకోవచ్చు. సర్జరీలు చేయించుకునే రోగుల బాధలను దూరం చేసిన ఘనత అనెస్తీషియాకు దక్కుతుంది. రోగికి నొప్పి, బాధ తెలియకుండా చేసే ఔషధ పదార్థాలనే అనెస్తీషియాలో భాగంగా వైద్య నిపుణులు వినియోగిస్తుంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ అనెస్తీషియా దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటాం. ఈసందర్భంగా దానిపై కథనమిది.
Also Read :Jharkhand Elections : జార్ఖండ్‌లో ఎన్డీయే వర్సెస్ ఇండియా.. బలాలు, బలహీనతలు ఇవే
ప్రస్తుత వైద్య రంగంలో అనెస్తీషియా మందులు లేకపోవడాన్ని మనం అస్సలు ఊహించుకోలేం. వాటివల్ల ఎన్నో సర్జరీలు చేయడం ఈజీ అయిపోయింది. అనెస్తీషియా ఇవ్వడం ద్వారా నిర్దిష్ట శరీర భాగాలు మొద్దుబారేలా చేస్తారు. రోగులు కొద్దిపేపు అపస్మారక స్థితిలో ఉండేలా చేస్తారు. వారు తిరిగి యాక్టివ్ అయ్యేలోగా సర్జరీని(Anaesthesia Day 2024) పూర్తి చేసేలా వైద్యులు ప్లాన్ చేసుకుంటారు. అనెస్తీషియా మత్తులో ఉండగా.. తమకు సర్జరీ జరుగుతోందనే ఫీలింగ్ కూడా రోగికి కలగదు. కొన్ని రకాల అనెస్తీషియా మందులను శ్వాస వ్యవస్థ ద్వారా శరీరంలోకి పంపుతారు. ఇంకొన్నింటిని ఐవీ ద్వారా అందిస్తారు. మానవ శరీరంలో అవయవాలు పాడైతే కృత్రిమమైనవి అమర్చగలుగుతున్నారంటే.. దానికి కారణం అనెస్తీషియా. ఇప్పుడు రికార్డు స్థాయిలో ఆపరేషన్లు జరుగుతున్నాయంటే.. దానికి కారణం కూడా అదే.
Also Read :November 2024 : వృశ్చికరాశిలోకి శుక్రుడు.. నవంబరు 7 వరకు మూడురాశుల వారికి కష్టాలు !
- 20వ శతాబ్దం ప్రారంభంలో కొకైన్‌తో తొలిసారి లోకల్ అనెస్తీషియా అందుబాటులోకి వచ్చింది. దీన్ని రోగులకు అందించడం కొందరు డాక్టర్లకు ప్రత్యేక పనిగా మారింది. ఈథర్ లేదా క్లోరోఫామ్ లేదా కొన్నిసార్లు రెండింటిని కలిపి సర్జరీల సందర్భంగా రోగులకు ఇచ్చేవారు.
- 1930వ దశకం వచ్చేసరికి అనెస్తీషియా మందుగా క్లోరోఫామ్ వినియోగం చాలావరకు తగ్గిపోయింది. ఈథర్ అంత సురక్షితం కాదని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
- ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్లలో వాడుతున్న మందులు, గ్యాస్‌లను తయారు చేయడానికి చాలాకాలం పట్టింది.
- అయితేే పలు ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ అనెస్తీషియాగా ఒకరకమైన ఈథర్‌నే వాడుతున్నారు.