Site icon HashtagU Telugu

World AIDS Day 2023 : పులిరాజా సేఫ్‌గా ఉన్నాడా ? లేడా ?

World Aids Day 2023

World Aids Day 2023

World AIDS Day 2023 : డిసెంబరు 1.. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. HIV లేదా AIDS దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా 3.9 కోట్ల మంది HIV‌తో ఇబ్బందిపడుతున్నారు. హెచ్​ఐవీ, ఎయిడ్స్ నయం కానీ ఓ దీర్ఘకాలిక వ్యాధి. కానీ జీవనశైలిలో మార్పులు.. మెడిసిన్​తో దీనిని కంట్రోల్​ చేయవచ్చు. ఈ నేపథ్యంలో దీనిపై  అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. నేటికీ చాలామందికి హెచ్‌ఐవీ, ఎయిడ్స్ మధ్య వ్యత్యాసం తెలియదు. ఈ వ్యాధి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join.

ఎయిడ్స్ గురించి ముఖ్యమైన అంశాలు.. 

హెచ్​ఐవీ యాంటీబాడీ టెస్ట్

హెచ్ఐవీ యాంటీబాడీ టెస్ట్ కోసం రక్తం, లాలాజలంలను సేకరిస్తారు. దీని ​ ద్వారా  హెచ్​ఐవీ సంక్రమణకు ప్రతిస్పందనగా రోగ నిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేసిన ప్రతిరోధకాలు గుర్తిస్తారు. .

యాంటీజెన్​ టెస్ట్

యాంటీజెన్ టెస్ట్ ద్వారా మీ శరీరంలోని యాంటీబాడీస్, వైరల్ యాంటిజెన్​ను గుర్తిస్తారు.

న్యూక్లియిక్ యాసిడ్ టెస్ట్

న్యూక్లియిక్ యాసిడ్ టెస్ట్.. వైరస్​ను నేరుగా గుర్తించే బ్లడ్​ టెస్ట్​. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు.. ప్రారంభ దశలోనే గుర్తించడానికి ఇది దోహదం చేస్తుంది. CD కౌంట్, వైరల్ లోడ్ టెస్ట్ వంటి టెస్ట్​లు కూడా హెచ్​ఐవీని గుర్తించడంలో(World AIDS Day 2023) హెల్ప్ చేస్తాయి.

Also Read: WhatsApp Feature : వాట్సాప్ మెసేజ్‌లను షెడ్యూల్ చేసే ఫీచర్ ఇదిగో