Site icon HashtagU Telugu

Valentine’s Day Special: ప్రేమ పక్షులకు ‘స్పెషల్’ ప్యాకేజీలు!

Lovers1

Lovers1

ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాలంటైన్స్ డే వేడుకలు రానే వచ్చాయి. అయితే ఇప్పటికే ప్రేమ పక్షులు వాలంటైన్స్ డే ఎలా జరుపుకోవాలి? ఏవిధంగా జరుపుకోవాలి? అంటూ ముందే ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు భజరంగ్ ధళ్ కార్యకర్తల భయం.. మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా సెలబ్రేషన్స్ కు దూరంగా ఉంటున్నారు మరికొందరు. అలాంటివాళ్ల కోసమే కొన్ని థీమ్ పార్క్ లు అద్భుతమైన ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ వివరాలెంటో తెలుసుకొని ఎంజాయ్ చేయండి.

వండర్లా.. హాలిడేస్ డెస్టినేషన్. వినోద థీమ్ పార్క్. రిసార్ట్ కూడా. ఫిబ్రవరి 14 (సోమవారం) తన థీమ్ పార్క్ లో ప్రత్యేక వాలెంటైన్స్ డే ఆఫర్‌ను ప్రకటించింది. GSTతో సహా రూ. 2,999 ప్యాకేజీలో థీమ్ పార్క్‌ లోకి ప్రవేశం, వేవ్ పూల్ ద్వారా విందు, పార్క్, రిసార్ట్ లో వాలెంటైన్ డెకర్, ఇంటరాక్టివ్ గేమ్‌లు, రొమాంటిక్ మ్యూజిక్, లైవ్ గేమ్‌లు, పోటీలు, ఇతర బహుమతులు ఉంటాయి. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్, ఇతరులను కాంటాక్ట్స్ దూరంగా ఉండేలా ఏర్పాటు చేశారు. అయితే కేవలం ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే ప్రవేశం కల్పించింది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెం.13లో, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 10 నిమిషాల దూరంలో ఉన్న ఈ పార్క్ ఎన్నో ఎంటర్ టైన్ మెంట్స్ కార్యక్రమాలను అందిస్తోంది. హైదరాబాద్‌తో పాటు, బెంగళూరు, కొచ్చి శాఖలలో కూడా వాలెంటైన్స్ డే ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులో ఉన్నాయి.

అద్దెకు బాయ్ ఫ్రెండ్..

ప్రేమికుల రోజును పురస్కరించుకొని ‘అద్దెకు బాయ్ ఫ్రెండ్’ అనే కాన్సెప్ట్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ట్రెండింగ్ లో ఉన్నప్పటికీ, మనదేశంలో  బీహార్​ లోని దర్భంగాలో ఇప్పుడు ఎక్కడ చూసినా అద్దెకు బాయ్ ఫ్రెండ్(Boyfriend on rent)అనే ప్లకార్డులతో ఓ యువకుడు దర్శనమిస్తున్నాడు. నగరంలోని ప్రతి ప్రాంతంలో ఈ ప్లకార్డును ప్రదర్శిస్తూ తిరుగుతున్నాడు. ఇంజినీరింగ్ విద్యార్థి ప్రియాన్షు “అద్దెకు బాయ్ ​ఫ్రెండ్​” అనే ప్లకార్డుతో వీధి వీధి తిరుగుతూ ప్రేమ సందేశాన్ని అందిస్తున్నాడు. నగరంలోని రాజ్ ​కోట్​, చర్చి, దర్భంగా టవర్​, బిగ్ ​బజార్​ లాంటి రద్దీ ప్రాంతాల్లో ఈ ప్లకార్డును ప్రదర్శిస్తున్నాడు ప్రియాన్షు. ఎందుకు ఇలా చేస్తున్నావని మనోడిని అడిగితే… ఒంటరిగా ఉన్నామని భావించే వారి అమ్మాయిల్లో ఆనందం తెప్పించడం కోసమ ప్లకార్డు పట్టుకున్నాని అంటున్నాడు.

రూటు మార్చిన భజరంగ్ దళ్

వాలంటైన్స్ డే వేడుకలు విదేశీ కల్చర్ లో భాగమని, మనదేశ సాంప్రదాయం కాదనీ భజరంగ్ దళ్ కార్యకర్తలు మండిపడుతున్నారు. వాలంటైన్స్ డే వేడుకులను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ పలు ఏరియాల్లో కార్యకర్తలు వాలంటైన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పిబ్రవరి 14 వాలంటైన్స్ డే కాదనీ, అమరవీరుల దినోత్సవం అని చాటిచెప్తున్నారు. వేడుకలు జరుపుకునే ప్రేమికులకు తాము పెళ్లిచేయబోమని, పెళ్లికి బదులు కౌన్సిలింగ్ ఇస్తామని స్పష్టం చేశారు.