Business Idea : మహిళలు…మీరు ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించవచ్చు…ఎలాగో తెలుసా.?

  • Written By:
  • Publish Date - November 17, 2022 / 06:07 PM IST

చాలామంది మహిళలకు ఉద్యోగం చేయాలన్న తపన ఉంటుంది. కానీ కొంతమందికి అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇళ్లు, పిల్లల యోగ క్షేమాలు చూసుకునే బాధ్యత మహిళలపై ఉంటుంది. అలాంటి సందర్భంలో  ఆఫీసుకు వెళ్లి ఉద్యోగం చేయడం కుదరదు. అలాంటి మహిళలు నిరాశ చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంట్లో కూర్చుండి సంపాదిస్తున్నారు. అలాంటి మహిళలకు ఎన్నో ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం.

షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌ను తెరవండి :
నేటికాలంలో చాలామంది ఆన్ లైన్ ద్వారానే షాపింగ్ చేస్తున్నారు. షాపింగ్ మాల్స్ కు వెళ్లి షాపింగ్ చేసే ఓపిక, సమయం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో మీరే స్వంతగా ఆన్ లైన్ బిజినెస్ ప్రారంభించవచ్చు. దీనికోసం మొదట మీరు ఎలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారు అనేది నిర్ణయించుకోండి. దీని ద్వారా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం ద్వారా ఆ వస్తువులను ఎలా విక్రయించాలో ఆలోచించాలి.
మీరు వెబ్ సైట్ ను కూడా తెరవచ్చు. లేదంటే ఇన్ స్టాగ్రామ్ వంటి ఫ్లాట్ ఫాంలో మీరు పేజీని క్రియేట్ చేసుకోవచ్చు. దీంతోపాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి వెబ్ సైట్స్ లో కూడా రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఈజీగా సంపాదించుకోచ్చు.

ట్రావెల్ ఏజెంట్ :
దూరప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ఏజెంట్ తో మాట్లాడాల్సి ఉంటుంది. ఏజెంట్ సాయంతో ట్రావెల్ కు సంబంధించిన ప్యాకేజీ గురించి చర్చిస్తుంటారు. కాబట్టి మీరు కూడా ట్రావెల్ ఏజెన్సీని రన్ చేయవచ్చు. దీని కోసం మీకు ల్యాప్ టాప్ మాత్రమే అవసరం. ఇంట్లో కూర్చుండి ఈజీగా ఈ పని చేసుకోవచ్చు.

హ్యాండిల్ పేజీ:
ఈ రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలతోపాటు ఇతరులు కూడా తమ సోషల్ మీడియా పేజీలను చూసేందుకు సహాయకులను నియమించుకుంటున్నారు. మీరు పేజిని నిర్వహించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. కొన్ని రోజుల తర్వాత మీకు పనిఒత్తిడి పెరిగితే..మీకు సహాయకులుగా ఇతరులను తీసుకోవచ్చు.

యోగా ట్రైనర్ :
మీరు యోగా ట్రైనర్ గా మాడటం వల్ల చాలా డబ్బు సంపాదించవచ్చు. ఉదయం , సాయంత్రం కొన్ని గంటలపాటు క్లాస్ తీసుకుంటే సరిపోతుంది.

డే కేర్ సర్వీస్ :
ఈ ఆలోచనలన్నింటితో పాటు, డే కేర్ సర్వీస్ ప్రారంభించడం కూడా మంచి వ్యాపార ఆలోచన. ఈ వ్యాపారం కోసం మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.