Sudha Murthy : అంతగొప్ప సుధామూర్తి.. 20 ఏళ్లుగా ఒక్కచీర కూడా కొనలేదు..ఎందుకు ?

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలు, రచయిత్రి, సామాజిక సేవకురాలైన సుధామూర్తి ఖరీదైన చీరల వైపు మొగ్గుచూపరు. అందుకు కారణం లేకపోలేదు. ఈ కారణం వింటే.. నిజమే కదా అనుకుంటారు.

  • Written By:
  • Updated On - October 29, 2023 / 06:38 PM IST

Sudha Murthy : సుధామూర్తి.. సాఫ్ట్ వేర్, ఐటీ రంగంలోనే కాదు.. దేశంలో ఈమె తెలియని వారుండరు. అంతగొప్ప సుధామూర్తి చాలా సాధారణంగా, తక్కువ ఖరీదైన చీరలు కడతారంటే ఎవ్వరూ నమ్మరు. గొప్పవాళ్లెప్పుడూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారని, ప్రతిదీ కాస్ట్ లీ వే వాడుతారని అనుకుంటారు కానీ.. సుధామూర్తి అందుకు భిన్నం. సాధారణంగా మహిళలకు ఎన్ని చీరలున్నా.. ఇంకా చీరలు కొనుక్కోవాలన్న కోరిక ఉంటుంది. కొందరికైతే ఖరీదైన చీరలు కొనడం చాలా ఫ్యాషన్. ఇంకొందరు 500-800 రూపాయల ధర ఉన్న చీరలను చూసి కొనలేక.. అంత ధర అని ముక్కునవేలేసుకుంటారు. మరికొందరైతే 5 నుంచి 10వేలకు పైనే చీరలు కొంటుంటారు. వాళ్లంతా డబ్బున్నవారే అనుకుంటే పొరబడినట్లే. మధ్యతరగతి కుటుంబాల్లో వేల రూపాయల విలువైన చీరలు కొనడం పరిపాటిగా మారింది.

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలు, రచయిత్రి, సామాజిక సేవకురాలైన సుధామూర్తి ఖరీదైన చీరల వైపు మొగ్గుచూపరు. అందుకు కారణం లేకపోలేదు. ఈ కారణం వింటే.. నిజమే కదా అనుకుంటారు. సుధామూర్తి ఆలోచనల ప్రకారం.. ఒక రూ.10 వేల ఖరీదైన చీరకొంటే దానిని 10వేల సార్లు కట్టుకుంటారా ? కట్టుకోరు కదా. 10 వేలసార్లు కాదు కదా.. ఒక ఏడాదిలో 10 సార్లు కూడా కట్టుకోరు. రెండుమూడు సార్లు కట్టుకుని, వాష్ చేసి ఇస్త్రీచేసి షెల్ఫ్ లో పెట్టుకునేందుకు 10 వేల రూపాయల చీర అవసరమా? అనేదే సుధామూర్తి ఆలోచన. రూ.2000 ఖర్చుచేసి చీర కొంటే.. 20-30 సార్లు, లేదా 50 సార్లు కట్టుకుంటాం. తక్కువ ఖరీదైన దాన్నే ఎక్కువగా ఉపయోగిస్తామని చెబుతారామె. మనం ఆనందంగా ఉండాలంటే.. అవసరానికి మించిన వస్తువులు ఉండాల్సిన అవసరం లేదు అంటారు. 73 ఏళ్ల సుధామూర్తి.. 20 ఏళ్లుగా తన కోసం ఒక్కచీర కూడా కొనలేదంటే ఎవ్వరూ నమ్మరు. కానీ.. ఇది నమ్మితీరాల్సిందే. అప్పుడప్పుడు ఎన్ జీఓలు, స్నేహితులు ఇచ్చిన చీరలను మాత్రమే ఆమె కట్టుకుంటారు. అందుకు కారణం ఆమె చేసిన ప్రతిజ్ఞ.

వారణాసి పర్యటనలో ఆహారం, నీరు, మందులు వంటి ప్రాథమిక అవసరాలు మినహా అన్ని షాపింగ్‌లను వదులుకుంటానని ఆమె ప్రతిజ్ఞ చేయడంతో మనసు మార్చుకుంది. “కాశీకి వెళ్లినప్పుడు మీకు బాగా నచ్చిన దాన్ని వదులుకోవాలని అంటారు. నేను షాపింగ్ చేయడాన్ని ఇష్టపడేదానిని, కాబట్టి గంగకు నేను చేసిన వాగ్దానం ఏమిటంటే, ఈ జీవితకాలం కోసం షాపింగ్‌ను వదులుకుంటాను, ”అని ఆమె 2018లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

సుధామూర్తి చెప్పి ఈ ఉదాహరణ కేవలం చీరల వరకే పరిమితం కాదు. జీవితంలో అవసరానికి మించింది ఏదీ అనవసరంగా కొనకూడదు. ఇలా చేస్తే.. ప్రతి మధ్యతరగతి కుటుంబం.. ఆర్థిక ఇబ్బందులు లేకుండా హ్యాపీగా జీవించవచ్చు.