తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, తన సాహసోపేతమైన నిర్ణయాలతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. టీడీపీలో తన రాజకీయ జీవితం ప్రారంభించి, కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కూడా పార్టీ సీనియర్ల విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తన దూకుడైన రాజకీయ శైలితో వారికి సమాధానం ఇచ్చి, చివరకు తెలంగాణ రాజకీయాల్లో గట్టి పట్టు సాధించారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే, పాలనలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం కొనసాగిస్తున్నారు. అయితే రేవంత్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతూ ప్రజల్లో అసంతృప్తి పెంచుతున్నాయి.
Trivikram : నవీన్ పోలిశెట్టి సినిమాకు త్రివిక్రమ్ సాయం
రేవంత్ రెడ్డి పాలనలో వివాదాస్పదంగా మారిన కొన్ని నిర్ణయాలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. హైడ్రా ప్రాజెక్టు కోసం ఇళ్ల కూల్చివేత, కొడంగల్‌లో భూసేకరణ, సినీ పరిశ్రమపై కఠిన వైఖరి, గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల వేలం – ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు పెరుగడానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా గచ్చిబౌలిలో హరితవనాన్ని నాశనం చేసి, భూములను వేలం వేసే నిర్ణయంపై విద్యార్థులు, పర్యావరణవేత్తలు, సినీ ప్రముఖులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు దీనిని రాజకీయంగా ఆసరాగా తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ నిరసనలు చేపడుతోంది. కాంగ్రెస్ మంత్రులు ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని మాత్రం తగ్గించలేకపోతున్నారు.
Garbage Cess : ప్రజలపై ‘చెత్త’ పన్ను భారం వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా చాకచక్యంగా పాలన సాగించాల్సిన సమయంలో ఒక వివాదం నుంచి మరొకదానికి జారిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలనలో మైనస్ పాయింట్లు పెరిగితే, ప్రజల్లో నెగెటివ్ ప్రచారం జరగడం సహజం. ఇదే పద్ధతిలో సాగితే ఏపీలో వైసీపీ ఎదుర్కొన్న పరిస్థితులను తెలంగాణ కాంగ్రెస్ కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉంది. రేవంత్ తన ఆలోచనలను, పాలనా తీర్నాలను మార్చుకోకపోతే, భవిష్యత్‌లో మరిన్ని రాజకీయ సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా, వివాదాలకు దూరంగా, అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఊరట తీసుకువస్తుంది. మరి రేవంత్ ఏంచేస్థాడో చూడాలి.