Site icon HashtagU Telugu

Mothers Day 2024 : సండే రోజే ‘మదర్స్ డే’ ఎందుకు నిర్వహిస్తారు ?

Mothers Day

Mothers Day

Mothers Day 2024 :  ఇవాళ మదర్స్ డే.. ప్రతిసారీ మదర్స్ డే సండే రోజే వస్తుంటుంది.. ఎందుకలా ? అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. దీనికి సమాధానం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join

మనకు మదర్స్ డే (Mothers Day 2024) గురించి తెలుసు.. కానీ అన్నా మారియా జార్విస్‌ గురించి తెలియదు.  ఈ అమెరికా మహిళ మరణించిన తేదీనే ‘మదర్స్‌ డే’గా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అన్నా మారియా మే నెల రెండో ఆదివారం నాడు(1905 మే 9న) చనిపోయారు.  అన్నా మారియా మరణానంతరం ఆమె కుమార్తె తన తల్లి జ్ఞాపకార్ధం మాతృదినోత్సవం నిర్వహించాలని విస్తృతంగా ప్రచారం చేశారు. 1911 సంవత్సరం నుంచి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోనూ మదర్స్ ‌డే వేడుకలను నిర్వహించడం మొదలైంది. 1914 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ ఏటా మే రెండో ఆదివారం రోజున మదర్స్ డేను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. కాలక్రమేణా ఇది ప్రపంచమంతటా వ్యాపించింది. 1872లో జూలియవర్డ్‌ హోవే అనే మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది.చరిత్రలోకి వెళితే.. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్‌ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. ఆ వేడుక కూడా ఆదివారం రోజే జరిగేది.

Also Read :Mothers Day 2024 : పురాణాల్లో లెజెండరీ మదర్స్.. వారి త్యాగనిరతికి హ్యాట్సాఫ్

అక్కడ ఆగస్టు 12న మదర్స్ డే

థాయ్‌లాండ్ దేశంలో మదర్స్ డేను ఆగస్టు 12న నిర్వహిస్తారు. ఎందుకంటే ఆ రోజున థాయ్‌లాండ్ మాజీ రాణి సిరికిత్‌ పుట్టినరోజు. 1950 నుంచి 2016 వరకు థాయ్‌లాండ్ రాణిగా ఆమె  కొనసాగారు. ఈ వ్యవధిలో ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందుకే సిరికిత్‌కు ‘మదర్‌ ఆఫ్‌ ది ల్యాండ్‌’గా పేరొచ్చింది. ఆగస్టు 12వ తేదీని థాయ్ లాండ్ ప్రజలు ‘థాయ్‌ మదర్స్‌ డే’ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. రాణికి, తమ తల్లులకు గౌరవ సూచకంగా వేడుకలు నిర్వహిస్తారు. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే మల్లెపూలను తమ తల్లులకు కానుకగా ఇస్తారు.

Also Read : Traffic Signal For Camels : ఎడారిలో ట్రాఫిక్ సిగ్నల్.. ఎందుకో తెలుసా ?