Site icon HashtagU Telugu

Beer Bottles Color: బీర్ బాటిల్స్ ఆకుపచ్చ మరియు గోధుమ రంగులో ఎందుకు ఉంటాయి?

Beer Bottles Color

Beer Bottles Color

Beer Bottles Color: మద్యం సేవించడం ఆరోగ్యానికి చాలా హానికరం. మద్యం సేవించడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. కానీ ప్రజలు ఇప్పటికీ మద్యం సేవిస్తున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎక్కడా అమలు చేయడం సాధ్యం కాదు. అనేక రకాల మద్య పానీయాలు ఉన్నాయి. అందులో ఎక్కువ భాగం బీరు చెలామణి అవుతుంది. బీర్ కంపెనీలు రెండు రంగుల్లో మాత్రమే బీర్ బాటిళ్లను తయారు చేయడం చూస్తుంటాం. ఇతర ఆల్కహాలిక్ పానీయాలు వేర్వేరు రంగులలో వచ్చినప్పుడు బీర్ సీసాలు ఆకుపచ్చ మరియు గోధుమ రంగులో మాత్రమే కనిపిస్తాయి.

చాలా సంవత్సరాల క్రితం ఈజిప్ట్‌లో బీర్ బాటిళ్లు తయారయ్యాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఇంతకు ముందు ప్లాస్టిక్ బాటిళ్లలో బీరు విక్రయించేవారు. అయితే సీసాలు సూర్యరశ్మికి గురైనప్పుడు యూవీ కిరణాలు వేగంగా రసాయనికంగా లోపల ఉన్న బీరును మార్చేస్తుండేవి. దీంతో రుచిలో వైవిధ్యం కనిపించేది. ఆ బీరు తాగి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. కాబట్టి బీరును బాటిల్‌లో ఎలా నిల్వ ఉంచాలి అన్న దానిపై పరిశోధన ప్రారంభమైంది.

సూర్య కిరణాల నుండి బీర్‌ను రక్షించడానికి సన్ గ్లాస్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఎండ నుండి కళ్ళను రక్షించడానికి సాధారణంగా వివిధ షేడ్స్‌లో అద్దాలు అందుబాటులో ఉంటాయి. అందువల్ల కాంతిని రిఫ్లెక్ట్ చేసే రంగులలో బీర్ సీసాలు తయారు చేయడం మొదలుపెట్టారు.దాంతో సూర్యరశ్మి లిక్విడ్ బీర్‌లోకి ప్రవేశించలేకపోయింది. ఫలితంగా బీర్ చాలా కాలం పాటు సురక్షితంగా ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గోధుమ రంగు సీసాలు అధికంగా ఉత్పత్తి చేశారు. అయితే కంపెనీలు బీర్ బాటిళ్లను ఆర్డర్ చేసినప్పటికీ, డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఆకుపచ్చని సీసాలలో బీరు విక్రయాలు ప్రారంభించారు. .అప్పుడే ఈ రెండు రంగుల్లో బీరు అమ్మే విధానం మొదలైంది.

Also Read: KCR Deeksha: కేసీఆర్ దీక్షకు గుర్తుగా నవంబర్ 29ని దీక్షా దినోత్సవం: కేటీఆర్

Exit mobile version