టీడీపీ మహానాడు (TDP Mahanadu 2025) నిర్వహణకు కడప (Kadapa) సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కార్యకర్తలకు పెద్ద పీఠ వేయడంతోపాటు పలు చరిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిలవనుంది. అయితే కడప లో ఈ వేడుక జరపడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. YSR అడ్డాలో ఇప్పుడు చంద్రబాబు (Chandrababu) వేడుక జరపడం వెనుక కారణం ఏంటి..? ఈ ఆలోచన ఎవరిదీ..? ఎవరు ముందుకు తీసుకెళ్లారు..? అసలు ఆ ఏర్పాట్లు ఎలా జరిగాయి..? అనేది ఇప్పుడు అందరి మదిలో మెలుగుతున్న ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సమాదానాలు మీము మీకు అందిస్తున్నాం.
కడపలో మహానాడు ఆలోచన ఎవరిదంటే..!!
ఈసారి తెలుగుదేశం పార్టీ మహానాడు ఎన్నడూ లేని విధంగా కడప నడిబొడ్డులో జరగుతుంది. నగరమంతా ఇప్పటికే పసుపురంగుతో కళకళలాడుతోంది. అయితే సాధారణంగా కడప అనేది వైసీపీ అడ్డాగా పేరుగాంచిన ప్రాంతం. అలాంటి ఈ ప్రాంతంలో టీడీపీ మహానాడు నిర్వహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికి గల ప్రధాన కారణం నారా లోకేష్. మూడు నెలల క్రితం పార్టీ నాయకులతో చర్చల్లో, మహానాడు ఎక్కడ నిర్వహించాలనే ప్రశ్నకు నారా లోకేష్ (Nara Lokesh) “కడపలో చేద్దాం” అని చెప్పడం చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఆ నిర్ణయానికి వెనుక ఉన్న ఉద్దేశాలు నిజంగా చాలా బలమైనవే.
Bandla Ganesh : బండ్ల గణేష్ సెటైరికల్ ట్వీట్..దిల్ రాజు పైనేనా ?
కడపలో పుంజుకుంటున్న టీడీపీ
గత రెండు దశాబ్దాలుగా ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ(TDP)కి విజయాలు అనేవి లేవు. 2004 నుండి 2019 వరకు ముఖ్యంగా కడప జిల్లాలో టీడీపీ గెలిచిన సీట్లు చేతి వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. కానీ 2024లో రాజకీయ వాతావరణం మారింది. టీడీపీ ఐదు స్థానాలు గెలుచుకోగా, బీజేపీ, జనసేన ఒక్కొక్కటేసి సీట్లు సాధించాయి. ఈ ఫలితాలతో టీడీపీకి స్థానికంగా తిరిగి జీవం పోసినట్లైంది. అందుకే కడప క్యాడర్‌ను మరింత శక్తివంతంగా నిలబెట్టేందుకు, వారి సేవలకు గుర్తింపుగా ఈసారి మహానాడు ఇక్కడే నిర్వహించాలని నిశ్చయించారు లోకేష్.
రాయలసీమ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రారంభమైంది. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి బహుళ ప్రాజెక్టులు రాయలసీమలో ఏర్పడుతున్నాయి. ఈ చర్యలతో ప్రాంత అభివృద్ధిపై టీడీపీ నిజంగా కృషి చేస్తోందన్న భావన ప్రజల్లోకి వెళ్లిపోతోంది. గతంలో వైసీపీ పాలనలో పట్టించుకోని అభివృద్ధిని ఇప్పుడు టీడీపీ తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. కడపను కేంద్రంగా తీసుకుని సీమ మొత్తం అభివృద్ధి పథంలోకి రావడం లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Poonam Kaur : పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ ?
క్యాడర్‌కి ఉత్సాహం, భరోసా
ఏ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే శక్తి. కడప క్యాడర్ చాలాకాలంగా నిరుత్సాహంలో ఉన్నది. వారికి మళ్లీ మనోధైర్యం కల్పించాలంటే, నేరుగా వారి ప్రాంతంలో మహానాడు నిర్వహించడం ఒక పెద్ద ప్రోత్సాహంగా నిలుస్తుంది. ఇది కేవలం పార్టీ సమావేశం మాత్రమే కాదు, క్యాడర్‌కు “మేము మీతో ఉన్నాం” అన్న సందేశాన్ని అందించే వేదిక. లోకేష్ నిర్ణయం పట్ల పరిశీలన చేస్తే.. ఆయనను ఎందుకు విజనరీ లీడర్ అని అంటారో స్పష్టంగా అర్థమవుతుంది.