Country Wise New Year: టిక్ టిక్ అంటూ గడియారంలోని ముళ్లులు వేగంగా కదులుతున్నాయి. 2024 డిసెంబరు 31ని ముగించుకొని.. 2025 జనవరి 1కి వీలైనంత త్వరగా స్వాగతం పలికేందుకు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో మనం కొన్ని ఆసక్తికర విశేషాలను తెలుసుకుందాం.. ప్రపంచంలో ఏ దేశాల్లో ముందుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతాయి ? ఏయే దేశాల్లో ఆలస్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతాయి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
క్రిస్మస్ ఐలాండ్
ప్రపంచంలోనే తొలి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రిపబ్లిక్ ఆఫ్ కిరిబాతి దేశంలో ఉన్న క్రిస్మస్ ఐలాండ్‌లో(Country Wise New Year) జరుగుతాయి. క్రిస్మస్ ఐలాండ్‌ను కిరిటిమాతి అని కూడా పిలుస్తారు. ఇది చిన్న ద్వీపం. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ (డిసెంబరు 31) మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగిపోయాయి.
ఛాథమ్ ఐలాండ్
ప్రపంచంలో రెండో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ న్యూజిలాండ్‌లో ఉన్న ఛాథమ్ ఐలాండ్‌లో జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ (డిసెంబరు 31న) మధ్యాహ్నం 3.45 గంటలకే అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, వెల్లింగ్టన్ నగరాల్లోనూ ఇవాళ సాయంత్రం 4.30 గంటలకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి.
ఆస్ట్రేలియా
న్యూజిలాండ్ దేశంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలైన రెండున్నర గంటల తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్ బెర్రాలలోనూ కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం .. ఆస్ట్రేలియాలోని పలు ప్రధాన నగరాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు జరుగుతాయి.
జపాన్, కొరియా, చైనా
జపాన్, దక్షిణ కొరియా, చైనా, ఉత్తర కొరియాలలో భారత కాలమానం ప్రకారం.. ఇవాళ రాత్రి 8.30 గంటలకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ షురూ అవుతాయి. ఇవాళ అర్ధరాత్రి కంటే ముందు నుంచే చైనా , ఫిలిప్పీన్స్, సింగపూర్‌లలో కొత్త సంవత్సరం వేడుకలు మొదలైపోతాయి.
భారత్, పాక్
ఇవాళ రాత్రి 11 గంటల నుంచి భారత్, నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయ్ లాండ్, మయన్మార్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలో కొత్త సంవత్సరం వేడుకలు మొదలైపోతాయి.
బాకెర్ అండ్ హౌలాండ్ ఐలాండ్స్
ఈ భూమిపై చివరగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి.. బాకెర్ అండ్ హౌలాండ్ ఐలాండ్స్‌లో జరుగుతాయి. ఈ ఐలాండ్స్ హవాయి దీవుల్లో ఉన్నాయి. అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ భారత కాలమానం ప్రకారం.. అత్యంత ఆలస్యంగా జనవరి 1న ఉదయం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి.