Earth Creature Vs Life On Moon : చంద్రుడిపై వాతావరణం లేదు.. గాలి లేదు.. ఊపిరి పీల్చుకోవడం అసాధ్యం..
అందుకే అక్కడ మానవుడి ప్రశ్నార్ధకం.
మరి ఇంత పెద్ద భూమి మీద.. అంత చిన్న చంద్రుడిపై నివసించే కెపాసిటీ కలిగిన జీవి ఒక్కటైనా లేదా?
అంటే.. ‘ఉంది’ అనే సమాధానం వినిపిస్తోంది.
ఇంతకీ అదే ప్రాణి ? ఇప్పుడు తెలుసుకుందాం..
Also read : Rain Alert Today : మూడు రోజులు వర్షాలు.. తెలంగాణ, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్
చందమామపై శ్వాస తీసుకునే ఛాన్స్ అస్సలు లేకున్నా బతికి బట్ట కట్ట గలిగే ఒక జీవి ఉందట. ఆక్సీజన్ లేకున్నా బేఫికర్ అంటూ బిందాస్ గా అది బతికేయగలదట. ఇన్ని అరుదైన లక్షణాలు కలిగిన జీవి గురించి చెప్పింది అలాంటి ఇలాంటి వ్యక్తులు కాదు. ప్రముఖ ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డోరతీ హచ్చన్ అండ్ టీమ్ ఈ జీవి గురించి ఒక రీసెర్చ్ రిపోర్ట్ ను తయారు చేసింది. దాన్ని ఇటీవల అమెరికాకు చెందిన విఖ్యాత ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ సంస్థ పబ్లిష్ చేసింది. తెలుపు రంగులో కేవలం 8 మిల్లీమీటర్ల సైజులో ఉండే హెన్నెగుయా షోక్కీ సాల్మినికోలా (Henneguya zschokkei) అనే పరాన్నజీవి చంద్రుడిపైనే బతకగలదని శాస్త్రవేత్తలు చెప్పారు.ఆక్సిజన్ లేకున్నా.. శ్వాస వ్యవస్థను కొనసాగించగల ఏకైక జీవి ఇదేనని సైంటిస్టులు తెలిపారు. హెన్నెగుయా చూడటానికి జెల్లీ ఫిష్ లాగా ఉంటుంది. మంచినీరు, ఉప్పునీరు రెండింటిలోనూ ఇది జీవించగలదు. అంటే ఇది మిక్సోజోవాన్. సాల్మన్ చేపలలో కనిపించే ఇతర బ్యాక్టీరియాలలాగా.. ఇది మనుషులకు ప్రమాదకరం కాదు.
Also read : Zurich Diamond League: జ్యూరిచ్ డైమండ్ లీగ్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా
అయితే ఆక్సిజన్ లేకున్నా.. అది ఎలా జీవిస్తోందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. సముద్రాల్లో ఉండే ఈ పరాన్నజీవి చినూక్ సాల్మన్ రకం చేపల లోపల జీవిస్తుందని వివరించారు. హెన్నెగుయా షోక్కీ సాల్మినికోలాలోని ప్రత్యేక జన్యు నిర్మాణం వల్లే అది ఆక్సిజన్ లేకున్నా జీవించగలుగుతోందని భావించిన శాస్త్రవేత్తలు.. దానిలో అలాంటి స్పెషల్ జీన్ ఏది ఉందని వెతికే ప్రయత్నం చేశారు. కానీ అలాంటి ప్రత్యేక జీన్ ఏదీ హెన్నెగుయాలో లేదని (Earth Creature Vs Life On Moon) తేలింది. శ్వాస క్రియ ద్వారా శరీరానికి శక్తిని అందించేలా చేతన కలిగించే జీన్స్ అందులో లేవని వెల్లడైంది. అవి లేకపోవడం వల్లే .. ఆక్సిజన్ కోసం అది ఎదురుచూడకుండా నిశ్చింతగా జీవిస్తోందని రీసెర్చ్ రిపోర్టులో విశ్లేషించారు.