State Bird: కనిపించకుండాపోతున్న పాలపిట్టలు.. దసరాకు దర్శనం లేనట్టేనా!

పాలపిట్ట తెలంగాణ అధికారిక రాష్ట్ర పక్షి. దసరా రోజున ఈ పక్షిని చూడటం అద్రుష్టంగా భావిస్తారు చాలామంది.

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 03:58 PM IST

State Bird: పాలపిట్ట తెలంగాణ అధికారిక రాష్ట్ర పక్షి. దసరా రోజున ఈ పక్షిని చూడటం అద్రుష్టంగా భావిస్తారు చాలామంది. ఈ పక్షిజాతి రోజురోజుకూ అంతరించిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ రిపోర్ట్ ప్రకారం.. గత 12 ఏళ్లలో 30 శాతం మేరకు కనిపించకుండాపోయినట్టు తెలుస్తోంది. దీంతో అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం (IUCN) ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రెడ్ లిస్ట్‌లో పేర్కొంది.  ఈ  సందర్భంగా బర్డ్ పాల్స్ వ్యవస్థాపకుడు శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రంలోని రైతులు దసరా రోజున ఈ పక్షిని చూస్తారని నమ్ముతారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే రోజుగా భావిస్తారు.

ఇది పంటను దెబ్బతీసే కీటకాలను నశింపజేసేలా చేస్తుంది. కాబట్టి ఇది రైతులకు వరం లాంటిది. అయినప్పటికీ, పురుగుమందుల విస్తృత వినియోగం ఫలితంగా పాలపిట్టలు తగ్గిపోతున్నాయి. ఇవి పాత చెట్ల కావిటీస్‌లో విశ్రాంతి తీసుకుంటాయి. అయితే విస్తృతమైన చెట్ల నరికివేత కారణంగా సహజ గూడు లేక అంతరించిపోతున్నాయి.

రియల్ ఎస్టేట్ పట్టణాలతో పాటు గ్రామాల్లోకి విస్తరిస్తుండటంతో  పాలపిట్టలతో పాటు ఇతర పక్షులు కనిపించకుండాపోతున్నాయి. పాలపిట్ట దర్శనం ప్రాముఖ్యత దాని వెనుక ఉన్న సాంస్కృతిక కారణాలతో సంబంధం లేకుండా తెలంగాణ వాసులకు గొప్ప సెంటిమెంట్ గా భావిస్తారు.. దురదృష్టవశాత్తు, ప్రజలు ఈ పక్షులను బంధిస్తున్నారు, దీంతో వాటి పునరుత్పత్తిపై ప్రభావం పడి అంతరించిపోతున్నాయి.