Site icon HashtagU Telugu

Pet Dogs : పెంపుడు కుక్కలు తోక ఉపడం వెనుకున్న అర్థం ఏంటో తెలుసా..?

Dogs

Dogs

కుక్కలన్నాక తోక ఊపకుండా ఉంటాయా..? దాన్ని పెంచుకునే వాళ్లు..దాంతో ఆడుకునేవాళ్లు కనిపిస్తే తోక ఊపుతుంది. తమ యజమానులను, తమను ప్రేమకగా చూసుకునేవారి పట్లు కుక్కలు చూపించే మమకారం గురించి జంతుశాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారోతెలుసా. ఎవరైనా కొత్తవాళ్లు కనిపించినప్పుడు శునకాలు ఎలా వ్యవహరిస్తాయన్న దానిపై చైనాలోని బీజింగ్ లో ఉన్న చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. పెంపుడు జంతువులు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తుంటాయన్నది పరిశీలించారు.

కొత్తగా ఎవరైనా తమకు నచ్చితే శునకాలు తమ తోకలను కుడివైపునకు ఎక్కువగా తిప్పుతున్నట్లు గుర్తించారు. ఎడమవైపు కూడా తోక ఊపినా…కుడివైపు ఎక్కువగా వంచడం, ఎక్కువగా ఊపుతుండటం చేస్తున్నట్లు శాస్ర్తవేత్తలు గమనించారు.

మనషులకైనా…జంతువులకైనా మెదడులో రెండు భాగాలుంటన్నాయది అందరికీ తెలిసిందే. అందులో కుడిభాగం ఎడమవైపు సగం శరీరాన్ని, ఎడమ వైపు భాగం కుడివైపు సగం శరీరాన్ని నియంత్రిస్తుంటాయి. ఈ క్రమంలోనే శునకాలకు సంతోషకరమైన అంశాలకు సంబంధించిన భాగం యాక్టివ్ గా మారుతున్నట్లు గుర్తించామని శాస్త్రవేత యాంగ్ క్యూ ఝూంగ్ తెలిపారు. ఈ క్రమంలోనే శునకాలు తోక కుడివైపు ఎక్కువగా ఊపుతున్నట్లు గుర్తించామన్నారు.

ఒకవేళ ఆయా వ్యక్తులు నచ్చనట్లయితే…భయపడినా…శునకాలు తమ తోకలను ఎడమ వైపు ఎక్కువగా ఊపుతున్నట్లు గుర్తించామన్నారు. కుక్కతోకపై పరిశోధన అంటూ ఏదో సరదాగా చేయలేదు. సుమారు 25 కుక్కల తోకలపై త్రీడీ మోషన్ సెన్సర్లు అమర్చి…రోజూ కాసేపు కొత్తవారిని చూపించారు. అదే సమయంలో వాటి మెదడును స్కాన్ చేస్తూ పరిశోధన నిర్వహించారు. ఈ క్రమంలో అన్ని కుక్కలు, అన్ని రోజులు కలిపి మొత్తంగా 21వేల సార్లు తోకలు ఊపడాన్ని పరిశీలించాకే ఈ నిర్దారణకు వచ్చారు. ఐసైన్స్ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలను ప్రచురించారు.