Army Built In Ladakh: భారత ఆర్మీ లడఖ్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టింది..?

  • Written By:
  • Updated On - November 17, 2022 / 03:33 PM IST

వాస్తవ నియంత్రణరేఖ వెంబడి వ్యూహాత్మకమైన సున్నిత ప్రాంతాల్లో సైనక బలగాలు ప్రభావంతంగా వ్యహరిస్తోన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి చైనా బలగాలు నిరంతరం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. చైనా బలగాలను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంనేందుకు చైనాకు ఎదురుగా ఉన్న తూర్పు లడఖ్ సెక్టార్ లో 450ట్యాంకులు, 22వేల మంది సైనికుల నివాసం కోసం మౌలిక సదుపాయాలను నిర్మించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి.

భారత్, చైనా వాస్తవనియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాంగోంగ్ త్సో సరస్సులో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత సైన్యం కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్ తూర్పు లడఖ్ ఈ రెండింటిలోనూ కొత్త ల్యాండింగ్ క్రాఫ్ట్ లను ప్రవేశపెట్టారు. ఇది పెట్రోలింగ్ సామర్థ్యాలకు , ఇండక్షన్ కు పోత్సాహాన్ని ఇచ్చాయని రక్షణ వర్గాలు తెలిపారు. ఈ క్రాఫ్ట్ 35 మంది సైనికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించాయి.

గత రెండేళ్లలో 22వేల మంది సైనికులకు కనీస అవసరాలతోపాటు సుమారు 450 వాహనాలతోపాటు తుపాకులను సంరక్షించుకునేలా సాంకేతికతో కూడిన నివాసాలను నిర్మించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా…రానున్న కాలంలో రక్షణ సంసిద్ధతను మెరుగుపరిచేందుకు శాశ్వత రక్షణతోపాటు మౌలిక సదుపాయాల నిర్మాణాలను చేపట్టడంపై కేంద్రం దృష్టి సారించిందని  రక్షణ వర్గాలు తెలిపాయి.

సరిహద్దుల వెంబడి నిర్మిస్తున్న శాశ్వత రక్షణ గురించి భారత ఆర్మీ ఇంజనీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ స్పందించారు. ఎడారి సెక్టార్ లో ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ మొదటిసారిగా 3డి ప్రింటెడ్ శాశ్వత రక్షణను నిర్మించినట్లు తెలిపారు. ఇలాంటి నిర్మాణాలు పేలుళ్లను తట్టుకుంటాయని…36, 48 గంటల్లో నిర్మించవచ్చని…వాటిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మార్చుకునే వీలుంటుందన్ని తెలిపారు.

చైనా సరిహద్దు వెంబడి ఉన్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అక్కడ చేస్తున్న అభివ్రుద్ధిని హైలైట్ చేస్తూ ప్రస్తుతం 9 సొరంగాలు 2,535 కిలోమీటర్ల పొడవైన సెలా టన్నెల్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇది పూర్తయితే ప్రపంచంలోనే ఎత్తైన ద్విలేన్ సొరంగం అవుతుందని రక్షణ వర్గాలు తెలిపారు. ఇదే కాకుండా మరో 11 సొరంగాలు కూడా ప్రణాళికలో ఉన్నట్లు వెల్లడించాయి. అంతేకాదు చైనా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్న న్యోమాలో అత్యంత ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ లలో ఒకదానిని నిర్మించి బాధ్యతతను BROకి అప్పగించింది ప్రభుత్వం.