Phone Tapping : ‘ఫోన్ ట్యాపింగ్’ దడ.. మీ ఫోన్ ట్యాప్ అయితే ఇలా గుర్తించండి

Phone Tapping : తెలంగాణ రాజకీయాలను ప్రస్తుతం కుదిపేస్తున్న అంశం.. ఫోన్ ట్యాపింగ్ !!

  • Written By:
  • Updated On - March 31, 2024 / 09:42 AM IST

Phone Tapping : తెలంగాణ రాజకీయాలను ప్రస్తుతం కుదిపేస్తున్న అంశం.. ఫోన్ ట్యాపింగ్ !! బీఆర్ఎస్ హయాంలో కొందరు ప్రభుత్వ పెద్దల గైడెన్స్ మేరకు పలువురు పోలీసు అధికారులు.. విపక్ష నేతల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి ? అదెలా చేస్తారు ? మన ఫోన్ ట్యాపింగ్ బారినపడితే ఎలా గుర్తించాలి ? అనే వివరాలు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఫోన్ ట్యాపింగ్ అంటే ?

ఫోన్ కాలింగ్, ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా జరిగే సంభాషణలను రికార్డు చేయడాన్నే ‘ఫోన్ ట్యాపింగ్’(Phone Tapping) అంటారు. ప్రత్యేకమైన డివైస్‌లను ఉపయోగించి ఇతరుల ఫోన్ సంభాషణలను వారికి తెలియకుండా వినడాన్నే ‘ఫోన్ ట్యాపింగ్’ అని చెప్పొచ్చు. అన్ని రకాల అధికారిక అనుమతులతో, ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యవహారాల పర్యవేక్షణ కోసం భారత ప్రభుత్వం సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టంను ఏర్పాటు చేసింది.

2జీ మొబైల్స్‌ ట్యాపింగ్ ఈజీ

  • మొబైల్ ఫోన్ల విషయానికి వస్తే.. సెకండ్ జనరేషన్ (2జీ) మొబైల్స్‌ను ట్యాప్ చేయడం సులభం. ‘స్కానింగ్ ఆల్ బ్యాండ్ రిసీవర్’ అనే పరికరం ద్వారా వీటిని ట్యాప్ చేయొచ్చు. ఎందుకంటే ఈ సిస్టం సాధారణ రేడియో ట్రాన్స్‌మిట్టర్ తరహాలో అనలాగ్ ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగిస్తుంది.
  • మూడో తరం డిజిటల్ ఫోన్లను మానిటర్ చేయడం కష్టమైన విషయం. ఎందుకంటే ఇవి డిజిటల్లీ ఎన్‌కోడెడ్, కంప్రెస్డ్ ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగిస్తాయి.
  • ప్రస్తుతం మొబైల్స్‌ను ట్యాప్ చేయడానికి ‘ఐఎంఎస్ఐ క్యాచర్’ అనే పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొబైల్ ఫోన్స్ సమీపంలో ఉంటే దీని ద్వారా ట్యాప్ చేయడం ఈజీ. అయితే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్న కాల్స్‌ను, సెక్యూర్ టెలిఫోన్స్‌ను దీని ద్వారా ట్యాప్ చేయలేం.
  • మీకు తెలియకుండా స్మార్ట్ ఫోన్‌లో స్పై యాప్స్ ఇన్‌స్టాల్ చేసినా ఫోన్లను సులభంగా ట్యాప్ చేయొచ్చు.
  • వెబ్ ట్యాపింగ్ కూడా ఇటీవల కాలంలో జరుగుతోంది. దీని ద్వారా యూజర్ల ఐపీ అడ్రస్‌లోకి లాగిన్ అయి వినియోగదారుల బ్రౌజింగ్ వివరాలను తెలుసుకుంటారు. మనం ఆన్‌లైన్‌లో ఏ వెబ్ సైట్ చూస్తున్నాం? ఏ యాప్ ఎక్కువ ఉపయోగిస్తున్నాం? వంటి వివరాలు దీని ద్వారా లీక్ అవుతాయి.

Also Read : Nara Lokesh : నారా లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత.. నేటి నుంచే అమల్లోకి

మీ ఫోన్ ట్యాప్ అవుతోందా ? 

  • ఫోన్ మాట్లాడేటప్పుడు వింత శబ్దాలు వినిపిస్తుంటే మీ ఫోన్ ట్యాప్ అయిందని అనుకోవచ్చు.
  • ఫోన్ బ్యాటరీ సడెన్‌గా డౌన్ అయినా.. ఫోన్ అనుకోకుండా వేడెక్కినా సందేహించాలి.
  • ఫోన్ షట్ డౌన్ ప్రాసెస్ సరిగ్గా జరగకపోయినా, దాని తర్వాత కూడా బ్యాక్‌లైట్ ఆన్‌లోనే ఉన్నా మీరు అలర్ట్ కావాలి.
  • ఫోన్ సడెన్‌గా ఆఫ్ అయి ఆన్ అవుతూ ఉన్నా, మీరు ఇన్‌స్టాల్ చేయని యాప్స్ మీ ఫోన్‌లోకి వచ్చిన జాగ్రత్తపడాలి.
  • మీ ఫోన్‌లో వేగంగా ఇంటర్నెట్ డేటా ఖర్చవుతుంటే సందేహించాలి. వెంటనే ఫోన్‌ను ఆఫ్ చేయాలి.
  • సడెన్‌గా మీ ఫోన్‌లో యాడ్స్ ఎక్కువైనా అలర్ట్ కావాలి.
  • ఈ మధ్య కొన్ని ఫోన్లలో మైక్ ఆన్ అయితే ఫోన్ పైభాగంలో ఒక గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఫోన్‌లో మీరు మైక్ ఉపయోగించనప్పుడు కూడా అది వెలుగుతుంటే ఫోన్ ట్యాపింగ్‌లో ఉన్నట్టు లెక్క.

Also Read :TDP – Social Equations : టీడీపీ సగానికిపైగా అసెంబ్లీ సీట్లు మూడు వర్గాలకే!

Follow us