Site icon HashtagU Telugu

Dry Ice : ‘డ్రై ఐస్’ దడ.. అది అంత డేంజరా ?

Dry Ice

Dry Ice

Dry Ice : డ్రై-ఐస్‌.. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇటీవల ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ రెస్టారెంట్లో ఐదుగురు భోజనం చేశారు. భోజనం చేయడం ముగిసిన అనంతరం కొంతమంది మౌత్‌ ఫ్రెషనర్‌ అనుకొని డ్రైఐస్‌‌ను నోట్లో వేసుకున్నారు. దీంతో వారు అప్పటికప్పుడు రక్తపు వాంతులు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  డ్రై ఐస్(Dry Ice) కారణంగా ఆ ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురై భయభ్రాంతులకు లోనయ్యారు.

We’re now on WhatsApp. Click to Join

‘డ్రై ఐస్‌’ అంటే.. ‘సాలిడ్ కార్బన్ డై ఆక్సైడ్’. ‘కార్బన్ డై ఆక్సైడ్’ ఘనరూపమే ‘డ్రై ఐస్’. సాధారణంగానైతే మంచు ఉష్ణోగ్రత మైనస్ 2 డిగ్రీల నుంచి మైనస్ 3 డిగ్రీల మధ్య ఉంటుంది. డ్రై ఐస్ ఉష్ణోగ్రత మైనస్ 80 డిగ్రీల సెల్సీయస్ దాకా ఉంటుంది. కార్బన్‌ డయాక్సైడ్‌ను 109 డిగ్రీల ఫారెన్‌ హీట్ వరకు ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ మంచులా మారుతుంది. ఈవిధంగా రెడీ అయ్యే డ్రై ఐస్‌ను శీతలీకరణ (కూలింగ్) ఏజెంట్‌గా వాడుతుంటారు. వైద్యంలో, ఆహార పరిశ్రమలో డ్రై ఐస్‌ను వాడుతారు. ఫోటో షూట్‌లలో కూడా సాధారణ మంచుకు బదులుగా డ్రై ఐస్‌ను వాడుతుంటారు.

గాలి సరిగ్గా  లేని ప్రదేశాలలో డ్రై ఐస్‌ను ఉంచితే మనుషుల పాలిట హానికరంగా పరిణమిస్తుంది. ఎంతలా అంటే.. డ్రై ఐస్ ఎఫెక్టుతో  చర్మం గడ్డకడుతుది.. కాలిపోతుంది !! డ్రై ఐస్ కార్బన్ డయాక్సైడ్‌ను రిలీజ్ చేస్తుంది. అందుకే వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో డ్రై ఐస్‌ను ఉంచితే.. అక్కడున్న వారికి ఊపిరాడకుండా చేస్తుంది. డ్రై ఐస్‌ను తీసుకుంటే.. వ్యక్తి మూర్ఛపోయే అవకాశం సైతం ఉంటుంది. డ్రై ఐస్‌ను నేరుగా చేతితో కూడా తాకకూడదని  అంటారు. డ్రై ఐస్‌ వల్ల తలనొప్పి, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వణుకు, చెవుల్లో శబ్ధాలు వినిపించడం వంటి సమస్యలు వస్తాయి. డ్రై ఐస్‌ను పొరపాటున కొరికినా.. వెంటనే వైద్యం చేయించుకోవాలి.

సాధారణంగా డ్రై ఐస్ సురక్షితమైనదే. కానీ చర్మంతో తాకినట్లయితే, దాని తక్కువ ఉష్ణోగ్రత కారణంగా అది కోల్డ్ బర్న్ వంటి సమస్యలను కలిగిస్తుంది.  డ్రై ఐస్ చూడటానికి సాధారణ మంచు మాదిరే తెల్లగా కనిపిస్తుంది. నీరు గడ్డకట్టడం ద్వారా సాధారణ ఐస్ తయారవుతుంది. అయితే  డ్రై ఐస్ కార్బన్ డయాక్సైడ్ ఘన రూపం. గాలి, పొగతో ప్రతిచర్య కారణంగా డ్రై ఐస్ తయారవుతుంది.