Site icon HashtagU Telugu

Cluster Bombs Explained : క్లస్టర్ బాంబులపై దుమారం.. ఎందుకు ? ఏమిటవి ?

Cluster Bombs Explained

Cluster Bombs Explained

Cluster Bombs Explained : రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌ దేశానికి క్లస్టర్ బాంబులను సరఫరా చేస్తామని అమెరికా ప్రకటించింది. జూలై 7నే క్లస్టర్ బాంబుల స్టాక్ ను ఉక్రెయిన్‌కు పంపామని వెల్లడించింది. ఈనేపథ్యంలో ఆ బాంబులపై చర్చ(Cluster Bombs Explained) మొదలైంది. అవి ఎలా పనిచేస్తాయి ? ఎలాంటి నష్టాన్ని కలిగిస్తాయి ? ఎంత ప్రమాదకరం ? అనే దానిపై డిస్కషన్ మొదలైంది.  మరోవైపు అమెరికా నిర్ణయంపై అనేక అమెరికా మిత్రదేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. క్లస్టర్ బాంబుల వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నామని  UK, కెనడా, న్యూజిలాండ్, స్పెయిన్ దేశాలు తెలిపాయి.

Also read : Use Emojis Carefully : ఎడాపెడా ఎమోజీ వాడినందుకు 50 లక్షలు కట్టాల్సి వచ్చింది

  1. క్లస్టర్ బాంబులు అంటే ఏమిటి?

    క్లస్టర్ బాంబు అనేది ఒక రకమైన ఆయుధం.  ఇది అనేక చిన్న బాంబుల యొక్క పెద్ద రూపం. దీన్ని రాకెట్లు, క్షిపణులు, ఫిరంగుల ద్వారా ప్రయోగిస్తారు. ఒక క్లస్టర్ బాంబును గాల్లోకి వదలగానే.. పేలే ముందు దాని దిగువ భాగం ఓపెన్ అయిపోయి .. అందులో నుంచి చిన్న బాంబులు కింద పడతాయి. ఫలితంగా ఒక క్లస్టర్ బాంబు అనేది ఏకకాలంలో చాలా ప్రాంతాల్లో పేలుళ్లు సృష్టించగలదు. భారీ సంఖ్యలో ఒక్కసారిగా క్లస్టర్ బాంబులను వదిలితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

  2. అమెరికా క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్‌కు ఎందుకు పంపుతోంది?

    ఉక్రెయిన్ దళాల దగ్గర మందుగుండు సామాగ్రి చాలా తక్కువగా ఉంది. ఈనేపథ్యంలో రష్యా ఆర్మీని కట్టడి చేసేందుకు క్లస్టర్ ఆయుధాలను అమెరికా నుంచి ఉక్రెయిన్ తీసుకుంటోంది. చాలామంది డెమొక్రాట్లు, మానవ హక్కుల కార్యకర్తలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. వీటన్నింటి నడుమ కనీసం ఆరు నెలల  చర్చ తర్వాత క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్ కు ఇవ్వడంపై అమెరికా నిర్ణయం తీసుకుంది.

  3.  క్లస్టర్ బాంబు ఎందుకు నిషేధించబడింది?

    మానవ, పర్యావరణ, నైతిక దుష్ప్రభావాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్లస్టర్ బాంబ్‌ను నిషేధించే ప్రయత్నం జరిగింది. క్లస్టర్ బాంబులో అనేక చిన్న బాంబులు ఉంటాయి. ఇవి రాకెట్ లేదా వార్‌హెడ్ నుంచి విడుదల చేయబడతాయి. ఈ బాంబులు ఎత్తు నుంచి పడినప్పుడు, చిన్న బాంబులు వాటి నుంచి బయటకు వచ్చి పెద్ద ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి.ఈ బాంబు వల్ల పిల్లలు ప్రత్యేకంగా గాయపడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ బాంబు చిన్న బొమ్మను పోలి ఉంటుంది.  పిల్లలు ఉత్సుకతతో.. దాన్ని బొమ్మ అనుకొని పట్టుకునే ముప్పు ఉంటుంది. UK, ఫ్రాన్స్, జర్మనీతో సహా 100 కంటే ఎక్కువ దేశాలు క్లస్టర్ బాంబుల వినియోగం లేదా నిల్వలను నిషేధించే అంతర్జాతీయ ఒప్పందంపై సంతకం చేశాయి.

  4. ఏ దేశాలు ఇప్పటికీ క్లస్టర్ బాంబులను ఉపయోగిస్తున్నాయి?

    2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి..   రష్యా, ఉక్రెయిన్ రెండూ క్లస్టర్ ఆయుధాలను ఉపయోగిస్తున్నాయని BBC నివేదించింది. వాటిని నిషేధించే ఒప్పందంపై ఆ రెండు దేశాలూ గతంలో సంతకం చేశాయి.