Site icon HashtagU Telugu

Warangal Mirchi: వరంగల్ మిర్చికి యూరప్‌లో ఫుల్ డిమాండ్‌!

Mirchi1

Mirchi1

దేశీ ఎర్ర మిరప రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. దీంతో ఆ మిర్చి సాగు చేసిన రైతులకు భారీగా సిరులను కురిపిస్తోంది. తెలంగాణలోనే కాకుండా విదేశాల్లో ఈ మిర్చికి ఫుల్ డిమాండ్ ఉంది. వరంగల్‌లోని ఎనుమాములలోని దేశీ ఎర్ర మిరప క్వింటాల్‌కు రూ. 90,000 అత్యధిక ధర పలికింది. ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌లో ఈ మిర్చికి మంచి ధర ఉండటం విశేషం. హన్మకొండ జిల్లా పరకాల మండలానికి చెందిన రైతు కె.అశోక్ తన ఎనిమిది బస్తాల ఎర్ర మిర్చి క్వింటాల్‌కు రూ.90,000 విక్రయించి మంచి ఆదాయం పొందాడు. వరంగల్ జిల్లాలోని మారుమూల రైతులు పెద్దఎత్తున ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ద్వారా ఎర్ర మిర్చి లోడ్ ను మార్కెట్ కు తరలించి, లాభాలు పొందుతున్నారు.

‘వండర్ హాట్’ రకం క్వింటాల్‌కు రూ.17,000-రూ.22,000 ధర ఉండగా, యూఎస్ 341 రకం రూ.20,000-రూ.27,500, తాలు రకం మిర్చి ధర రూ.4,000-రూ.8,700 మధ్య ధర పలుకుతోంది. ఈ సందర్భంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి బివి రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశీ రకం మిర్చికి యూరప్‌లో డిమాండ్‌ ఉందని, అందుకే ఒక్కసారిగా ధర పెరిగిందన్నారు. దేశంలోని అబుదాబి, యూఏఈ, యూరప్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ వంటి దేశాలకు దేశీ రకానికి చెందిన ఎర్ర మిరపకాయలను ఎగుమతి చేయడం ద్వారా వ్యాపారులు కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశాడు.

Exit mobile version