Trending

World Vegetarian Day : ఆరోగ్యం, రుచికి కేరాఫ్ శాకాహారం.. వెజిటేరియన్ డే నేడే

World Vegetarian Day : ఈరోజు శాకాహార దినోత్సవం. శాకాహారం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Vegetarians count in world vegetarians percentage in India

Vegetarians count in world vegetarians percentage in India

World Vegetarian Day : ఈరోజు శాకాహార దినోత్సవం. శాకాహారం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మాంసాహారం కంటే శాకాహారం ఉత్తమమైనదని, ఆరోగ్యకరమైందని నిపుణులు చెబుతుంటారు. శాకాహారులే ఎక్కువ కాలం జీవిస్తారనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.  ఏటా అక్టోబర్ 1న  ‘‘ప్రపంచ శాకాహార దినోత్సవం’’ జరుగుతుంది. అక్టోబర్ నెల మొత్తాన్ని వెజిటేరియన్ అవేర్‌నెస్ మంత్‌గా జరుపుతారు. శాకాహార దినోత్సవం సందర్భంగా ఆ ఫుడ్ తో ముడిపడిన కొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Also read : Telangana : హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పోస్టర్లు

180కి పైగా దేశాలలో.. 

1977లో నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీ (NAVS) ప్రపంచ శాకాహార దినోత్సవం అనే అంశాన్ని తొలిసారిగా తెరపైకి  తెచ్చింది. ఈ ప్రతిపాదనకు 1978లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్ ఆమోదం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 180కి పైగా దేశాలు శాకాహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, థాయ్ లాండ్ దేశాల్లో ఈ దినోత్సవం జాతీయ గుర్తింపును కూడా పొందింది. శాకాహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు నుంచి ఎలా బయటపడొచ్చనేది ఈరోజున ప్రచారం చేస్తున్నారు. శాకాహారం వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రచారాలు, ఈవెంట్లు జరుపుతున్నారు.

శాకాహారంలోనూ విటమిన్లు, ప్రోటీన్లు

మాంసాహారం తరహాలోనే శాకాహారంలోనూ విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. మాంసాహారం తినడం వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. వెజిటబుల్స్ తింటే ఆ ముప్పు ఉండదని అంటున్నారు. శాకాహారులతో పోల్చుకుంటే మాంసాహారులలో చాలా త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్’ జర్నల్‌లో ఓ స్టడీ రిపోర్ట్ పబ్లిష్ అయింది. బరువు తగ్గాలనుకునే వారికి శాకాహారం బెస్ట్ అని ఇంకొన్ని అధ్యయన నివేదికలు వచ్చాయి. నాన్‌వెజ్‌ను తలపించే కొన్ని వెజ్ వంటకాల్లో మష్రూమ్‌ పిజ్జా, స్పైసీ గార్లిక్‌ టోఫూ, పనస బిర్యానీ, బైగన్‌కత్రి, సోయా కీమా వంటివి (World Vegetarian Day) ఉన్నాయి. వాటిని వండుకొని అచ్చం మటన్, చికెన్ లెవల్ లో టేస్ట్ ను వెజిటేరియన్లు ఆస్వాదించొచ్చు.

  Last Updated: 01 Oct 2023, 12:33 PM IST
Exit mobile version