Veena Vani 20th Birthday : వీణ-వాణీ 20వ బర్త్ డే.. అవిభక్త కవలల సర్జరీకి సాయం చేయని సర్కారు !

Veena Vani 20th Birthday : పుట్టుకతోనే తలలు అతుక్కుని జన్మించిన అవిభక్త కవలలు వీణ-వాణీల 21వ బర్త్ డే ఈరోజే.

Published By: HashtagU Telugu Desk
Veena Vani 20th Birthday

Veena Vani 20th Birthday

Veena Vani 20th Birthday : పుట్టుకతోనే తలలు అతుక్కుని జన్మించిన అవిభక్త కవలలు వీణ-వాణీల 20వ బర్త్ డే ఈరోజే. 20 ఏళ్లుగా హైదరాబాద్‌లోని శిశు విహార్‌లోనే ఉంటున్న వీరు.. ఏటా అక్కడే తమ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం వీరు సీఏ రెండో సంవత్సరం (Veena Vani 20th Birthday) చదువుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడేనికి చెందిన మారగాని మురళీ-నాగలక్ష్మి దంపతులకు 2003 అక్టోబర్‌ 16న సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వీణ-వాణీలు జన్మించారు. వీరికి గుంటూరుకు చెందిన నాయుడమ్మ వైద్య చికిత్స అందించారు. అనంతరం నీలోఫర్‌ ఆసుపత్రిలో చేర్పించగా, వారు అక్కడే ఉంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వీణ-వాణీలకు సర్జరీ చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ దేశాల వైద్య నిపుణులు వచ్చి అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు.  అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఆపరేషన్‌ చేయలేదు. తమ పిల్లలకు ఆపరేషన్‌ చేయాలని అన్ని ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను కలిసి వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని వీణ-వాణీ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పిల్లలతో కలిసి ఉండేందుకైనా ప్రభుత్వం ఉపాధి అవకాశం కల్పించాలని విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు.  ఈ ఏడాది వీణ వాణీలు తమ సొంతూరుకు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపి వెళ్లారు.

Also Read: KCR Nomination : కేసీఆర్, కేటీఆర్ నామినేషన్ ఖర్చులకు రూ.లక్ష పంపారు.. ఎవరు ?

  Last Updated: 16 Oct 2023, 07:55 AM IST