Valentines Week 2025: ప్రేమికుల దినోత్సవం వస్తోంది. ఫిబ్రవరి 14న లవర్స్ డే/వాలెంటైన్స్ డే జరగనుంది. అయితే అంతకంటే ముందు వాలెంటైన్స్ వీక్ జరగబోతోంది. ఫిబవ్రరి 7 నుంచి 14వ తేదీ వరకు ఈ వీక్‌ను లవర్లు సెలబ్రేట్ చేసుకుంటారు. విదేశాల నుంచి వచ్చిన ఈ వేడుకల సంప్రదాయాన్ని ఎంతో మంది భారతీయ యువత జరుపుకుంటున్నారు. ప్రత్యేకించి మన దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ వేడుకల ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇంతకీ వాలెంటైన్స్ వీక్‌లో ఏయే రోజు ఏమేం చేస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :CLP Meeting: ఇవాళ సీఎల్‌పీ భేటీ, సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన.. ఆంతర్యం ఏమిటి ?
ఫిబ్రవరి 7 : రోజ్ డే
ఫిబ్రవరి 7న రోజ్ డేగా(Valentines Week 2025) జరుపుకుంటారు. ప్రేమికులు ఆ రోజు ఒకరికొకరు గులాబీలు ఇచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కొంతమంది తొలిసారి గులాబీ ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటారు. ఈ తేదీన ప్రధాన నగరాల్లో గులాబీల అమ్మకాలు జోరుగా జరుగుతాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మన దేశంలో ప్రతి రోజూ రూ.68.4 కోట్ల గులాబీ వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారం కాస్తా రోజ్ డే రోజున దాదాపు రూ.100 కోట్లకు చేరుతుందట.
ఫిబ్రవరి 8 : ప్రపోజ్ డే
ఫిబ్రవరి 8న ప్రపోజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమను ప్రపోజ్ చేయడానికి ఈ రోజు ప్రత్యేకం. ప్రేమను వ్యక్తీకరించడానికి ప్రపోజ్ డే చాలా స్పెషల్. ఈసందర్భంగా విభిన్న రకాల గిఫ్టుల విక్రయాలు జోరుగా జరుగుతుంటాయి.
Also Read :AIMIM : ఓఖ్లా, ముస్తఫాబాద్ సీట్లపై ట్రెండ్స్ ఏమిటి..? రాజధాని రాజకీయాల్లో ఎంఐఎం గట్టి సవాలు విసిరిందా..?
ఫిబ్రవరి 9 : చాక్లెట్ డే
ఫిబ్రవరి 9న చాక్లెట్ డేగా జరుపుకుంటారు. ఈరోజున లవర్లు ఎర్ర గులాబీతో పాటు చాక్లెట్లు ఇచ్చుకుంటారు. తమ లవ్‌ను పరస్పరం వ్యక్తీకరిస్తారు. మనదేశంలో రోజూ 3.87 లక్షల కిలోల చాక్లెట్లు సేల్ అవుతుంటాయి. చాక్లెట్‌డే రోజున 5 లక్షల కిలోల చాకెట్లు సేల్ అవుతాయట.
ఫిబ్రవరి 10 : టెడ్డీ డే
ఫిబ్రవరి 10న టెడ్డీ డేగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేయసులకు టెడ్డీలను కానుకగా ఇస్తుంటారు. లవర్లు ఇచ్చే అందమైన టెడ్డీలను ప్రేయసులు అపురూపంగా అందుకొని గుండెలకు హత్తుకుంటారు. ఈ డే రోజున టెడ్డీబేర్ బొమ్మల విక్రయాలు జోరందుకుంటాయి. మన దేశంలో రోజూ సగటున రూ.14.67 కోట్ల సాఫ్ట్‌టాయ్స్ సేల్ అవుతాయి. టెడ్డీడే రోజున రూ.25 కోట్లకుపైగా విక్రయాలు జరుగుతాయి.
ఫిబ్రవరి 11 : ప్రామిస్ డే
ఫిబ్రవరి 11న లవర్లు ప్రామిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. లవర్లు ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు. కలకాలం కలిసి ఉంటామనే బాసలు చెప్పుకుంటారు.
ఫిబ్రవరి 12 : హగ్ డే
ఫిబ్రవరి 12న లవర్లు హగ్ డే జరుపుకుంటారు. ప్రేమానురాగాలు, కష్ట సుఖాలకు చిహ్నం హగ్. తమ సాన్నిహిత్యాన్ని ప్రతిబింబించేలా ప్రేమికులు హగ్ చేసుకుంటారు. కలకాలం ఇలాగే కలిసుంటామనే భరోసా ఇచ్చుకుంటారు. హగ్ డే (ఫిబ్రవరి 12) రోజు 12సార్లు హగ్ చేసుకునే సెంటిమెంట్ విదేశాల్లో యువతకు ఉంటుందట.
ఫిబ్రవరి 13 : కిస్ డే
ఫిబ్రవరి 13న కిస్ డేను లవర్లు జరుపుకుంటారు. ఒకరికొకరు ప్రేమపూర్వక ముద్దులు పెట్టుకుంటారు.