Nature Man: అతడు అడవిని జయించాడు.. ఉద్యోగం వదిలి, ప్రకృతితో మమేకమై!

ఈ ఉరుకుల పరుగుల జీవితం వద్దు.. నచ్చినట్టు జీవితాన్ని బతికేద్దాం అంటున్నారు ఈ తరం యూత్.

  • Written By:
  • Updated On - May 26, 2023 / 05:10 PM IST

కాలం మరుతోంది. కాలంతో పాటు మనుషుల ఆలోచనలు మారుతున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో (World) చాలామంది కాలంతో పరిగెడుతూ అనుకున్న లక్ష్యాలను సాధిస్తుంటే, మరోవైపు అతి కొద్దిమంది మాత్రమే ఈ ఉరుకుల పరుగుల జీవితం (Life) వద్దు.. నచ్చినట్టు జీవితాన్ని బతికేద్దాం అంటున్నారు. సరిగ్గా ఇలాంటి కోవకు చెందుతాడు ఓ వ్యక్తి. ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన ఒక వ్యక్తి హవాయిలోని అడవిలో ఓ ట్రీహౌస్‌లో నివసించడానికి సూపర్ మార్కెట్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.

ఆయన పేరు రాబర్ట్ (Robert) బ్రెటన్, వయస్సు 35, ఉత్తర కాలిఫోర్నియాలోని ఒక సూపర్ మార్కెట్‌లో క్యాషియర్‌గా పనిచేశాడు. అతను ప్రకృతిని  కాపాడుకోవాలనుకున్నాడు. అందుకే అతను తన ఉద్యోగాన్ని (Job) విడిచిపెట్టాడు.  హవాయి అడవిలో ఒక ట్రీహౌస్ను నిర్మించాడు. సరైన స్థలాన్ని కనుగొనడానికి ఒక వ్యాన్‌లో US గుండా ప్రయాణించాడు. చివరకు హవాయిలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. తన నెలవారీ TikTok సంపాదనతో భూమిని కొనుగోలు చేశాడు. భూమి అతని ధర $29,850 అంటే సుమారు రూ. 24,64,789.

రాబర్ట్ ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసి మొదటి నుండి తన ట్రీహౌస్‌ను నిర్మించాడు. అతను కేవలం వర్షపు నీటిపై ఆధారపడతాడు. తన ఆహారాన్ని సొంతంగా పండించుకుంటాడు. అంతేకాదు.. తినడానికి కావాల్సిన ఆకు కూరగాయలను పండిస్తున్నాడు. తనకు నచ్చనట్టు బతుకున్నాడు. రణగణ ధ్వనులకు దూరంగా ప్రశాంతమైన (Peaceful Life) జీవితాన్ని గడుపుతున్నాడు. రాబర్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంది. అందులో తనకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. “ప్రకృతితో కనెక్ట్ కావడం ఎంతో నచ్చింది. ఆధునిక ప్రపంచం పరిమితులను అధిగమించడానికి నేను ప్రజలకు సహాయపడతాను” అని రాబర్ట్ అంటున్నాడు. ప్రస్తుతం రాబర్ట్ కు సంబంధించిన వీడియోలు చూస్తే వావ్ వాట్ ఏ లైఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Also Read: Dog Helmet: రూల్ ఈజ్ రూల్.. హెల్మెట్ ధరించిన కుక్క, చక్కర్లు కొడుతున్న వీడియో!