Twitter Logo : మళ్లీ మారిన ట్విట్టర్ లోగో..

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ లోగో కింద ఉన్న పిట్టను ను మార్చి డోజ్ కాయిన్ లోగో (షిబా ఇను లోగో) అయిన కుక్క బొమ్మకు పెట్టాడు.

Published By: HashtagU Telugu Desk
Twitter Logo Changed Again.. Elon Musk

Twitter Logo Changed Again.. Elon Musk

Twitter Logo : ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుండి ఏదోవిధంగా వార్తలోకి ఎక్కుతూనే ఉన్నాడు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ లోగో కింద ఉన్న పిట్టను ను మార్చి డోజ్ కాయిన్ లోగో (షిబా ఇను లోగో) అయిన కుక్క బొమ్మకు పెట్టాడు. ఎలాన్ మస్క్ ఎందుకు ట్విట్టర్ లోగో పక్షి బొమ్మ మార్చి కుక్క బొమ్మకు పెట్టినట్టు..? డోజ్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ. ఎలాన్ మస్క్ కు ఈ క్రిప్టోలో పెద్ద మొత్తంలో పెట్టబడులు ఉన్నాయని, డోజ్ కాయిన్ ఒక్క విలువను పెంచేందుకే ఇలా చేస్తున్నాడు అని సామాజిక మాధ్యమాల్లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు.

మళ్లీ మూడు రోజుల తర్వాత ఎలాన్ మస్క్ పాత పిట్టను తీసుకొచ్చి ట్విట్టర్ (Twitter) లోగోలో పెట్టేశాడు. దీంతో ఆ కుక్క బొమ్మ కనుమరుగైంది. గతేడాది జరిగిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎలాన్ మస్క్ పై వ్యతిరేకంగా డోజ్ కాయిన్ ఇన్వెస్టర్లు 258 బిలియన్ డాలర్ల భారీ పరిహారం కోరుతూ “మన్ హటన్ ఫెడరల్ కోర్టు” లో వ్యాజ్యం దాఖలు చేశారు. డోజ్ కాయిన్ ఇన్వెస్టర్లు “ఎలాన్ మస్క్, డోజ్ కాయిన్ ధరను కృత్రిమంగా పెంచి, ఆ తర్వాత పతనానికి కారణమయ్యాడని” ఆరోపణలో పేర్కొన్నారు.

ఇప్పుడు ఎలాన్ మస్క్ సర్రిగా మూడు రోజుల క్రితం ట్విట్టర్ లోగో పిట్టను తొలగించి, దాని స్థానంలో డోజ్ కాయిన్ లోగో అయిన కుక్క బొమ్మను పెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. అది కూడా కొంత సమయం వరకు ఎదో పొరపాటున జరిగి ఉంటుంది అని అనుకోగా, మూడు రోజుల పాటు డోజ్ కాయిన్ లోగో అయిన కుక్క బొమ్మనే ట్విట్టర్ లోగోగా కొనసాగించాడు. అయితే, మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసి, డోజ్ కాయిన్ లోగోతో మార్చాలంటూ లోగడ ఓ ఇన్వెస్టర్ ట్విట్టర్ లో సూచించడం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలసి ఉంటుంది. ఆనాటి ఆ ఇన్వెస్టర్ సూచనను ఇప్పుడు ఎలాన్ మస్క్ అమలు చేసి చూపించినట్టయింది.

Also Read:  Nandita Swetha : నందిత శ్వేతా తన బోల్డ్ లుక్స్ తో అభిమానులను కట్టిపడేస్తుంది..

  Last Updated: 07 Apr 2023, 02:08 PM IST