TV9 Rajinikanth : స్ట్రైట్ టు ద పాయింట్

27 ఏళ్ల జర్నలిజం కెరియర్లో ఓ మచ్చ లేకుండా ఉన్న రజినీపై కావాలనే కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేయడం చాలామంది తట్టుకోలేకపోతున్నారు

  • Written By:
  • Publish Date - November 17, 2023 / 09:05 PM IST

వెల్లలచెరువు రజనీకాంత్ (TV9 Rajinikanth) అంటే చాలామందికి తెలియదు కానీ TV9 రజనీకాంత్ (TV9 Rajinikanth) అంటే ప్రతిఒక్కరికి సుపరిచితుడే. ప్రస్తుతం టీవీ9 తెలుగు న్యూస్ ఛానెల్ (TV 9 telugu News Channel) మేనేజింగ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రజనీకాంత్ కెరీర్ అభినందనీయం. పొలిటికల్ డిబేట్స్ నిర్వహించడంలో రజనీ దిట్ట. ఈయన డిబేట్స్ అన్ని కూడా ఎక్కువగా రాజకీయ అంశాలపైనే ఉంటాయి. అలాంటి రజనీ ఫై రీసెంట్ గా పలు ఆరోపణలు రావడం అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి. 27 ఏళ్ల జర్నలిజం కెరియర్లో ఓ మచ్చ లేకుండా ఉన్న రజినీపై కావాలనే కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేయడం చాలామంది తట్టుకోలేకపోతున్నారు. జర్నలిజం లో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని..జర్నలిజం చేసినవారికి ఆదర్శంగా ఉన్న రజినీపై ఆరోపణలు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. రజనీ సైతం తనపై వస్తున్న ఆరోపణలపై నిజాయితగా పోరాడుతూ… ఎక్కడ కూడా తగ్గకుండా ఆ ఆరోపణలను ఎదురుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

రజనీకాంత్ బాల్యం – చదువు

వెల్లలచెరువు రజనీకాంత్ 1975లో గుంటూరులో జన్మించారు.ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ మరియు తెలుగు విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రజనీకాంత్ 1995లో వార్తా పత్రికలో జర్నలిస్టుగా కెరీర్‌ని ప్రారంభించారు. మూడు సంవత్సరాలు వార్తలో రిపోర్టర్‌గా పనిచేసారు. ఆ తర్వాత సిటీ కేబుల్ ఛానెల్‌లో పనిచేసారు.

టీవీ 9 లో రజనీ చేరిక :-

2003లో రజనీ TV9లో చేరారు. ప్రత్యేక ప్రతినిధి నుండి మేనేజింగ్ ఎడిటర్ స్థాయి వరకు, అతను కాలక్రమేణా TV9 ముఖంగా మారాడు. ఓపెన్ ఫోరమ్, క్వశ్చన్ అవర్, న్యూస్ టునైట్, 9 PM లైవ్ షో, బిగ్ న్యూస్ – బిగ్ డిబేట్ మొదలైన రాజకీయ చర్చలను నిర్వహించడంలో అతనికి అతనే చాటి అనిపించుకున్నాడు. రజనీకాంత్‌లో ఉన్న ఆత్మవిశ్వాసం ..ఆయనలో ఉన్న లక్షణాలు అతన్ని మరింత పాపులర్ చేసాయి. రాజకీయ ఇంటర్వ్యూలు మరియు విమర్శనాత్మక విశ్లేషణలు చేయడంలో రజనీకాంత్ దిట్ట. అందుకే రజనీకాంత్ ఇంటర్వ్యూ అంటే భయపడేవారు ఉంటారు..ఇష్టపడే వారు ఉంటారు.

రజినీపై వస్తున్న ఆరోపణలు :

ఇటీవల రజనీకాంత్ ఫై ఓ పొలిటికల్ పార్టీ కి సంబదించిన కీలక వ్యక్తి.. ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. రజనీకాంత్ అధికార పార్టీ కి కొమ్ము కాస్తున్నాడని చెప్పి ఆయనపై పలు రకాల ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. 27 ఏళ్ల జర్నలిజం కెరియర్ లో రజనీ ఫై పలు ఆరోపణలు వచ్చినట్లు ఎక్కడ లేదు..అయినప్పటికీ రజనీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనీ కొంతమంది చూస్తున్నారు. సోషల్ మీడియా ను వేదిక గా చేసుకొని ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ రజనీకాంత్ తన నిజాయితీని నిరూపించుకుంటూ తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీడియా లో ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణం. అధికార పార్టీ కి సంబదించిన ఏదైనా కాస్త మంచిగా మాట్లాడిన..కాస్త పొగడ్తలు కురిపించిన వెంటనే జర్నలిజం విలువలు గాలికి వదిలేసి మీడియా సంస్థలు పార్టీలకు, పాలకులకు కొమ్ము కాస్తున్నాయి అంటూ ఆరోపించడం కామన్. ఇలాంటివి ఎవరికైనా..ఏ ఛానల్ ప్రతినిధులకైనా తప్పవు. ఇప్పుడు రజనీకాంత్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అయినప్పటికీ ఆయనకు సపోర్ట్ గా చాలామందే నిలుస్తున్నారు.

Read Also : Vijayashanthi: కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి, కండువా కప్పిన ఖర్గే