Transgenders: ట్రాన్స్‌జెండర్లకు నెలకు రూ.1000 ఫించన్

ట్రాన్స్‌జెండర్ల గౌరవాన్ని పెంచుతూ జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి సామాజిక భద్రత కల్పించి, ప్రజాస్రవంతిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో జార్ఖండ్ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది.

Transgenders: ట్రాన్స్‌జెండర్ల గౌరవాన్ని పెంచుతూ జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి సామాజిక భద్రత కల్పించి, ప్రజాస్రవంతిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో జార్ఖండ్ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరిని వెనుకబడిన తరగతుల కేటగిరీ కింద చేర్చి వారికి ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాబినెట్ సెక్రటరీ వందనా దాడెల్ మాట్లాడుతూ, “సామాజిక సహాయ పథకం కింద ట్రాన్స్‌జెండర్ల కోసం ముఖ్యమంత్రి రాజ్య సామాజిక్ సురక్ష పెన్షన్ యోజన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది. అర్హులైన లబ్ధిదారునికి నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయంగా అందజేస్తారు. 2011లో జార్ఖండ్‌లో లింగమార్పిడి జనాభా దాదాపు 11,900, ప్రస్తుతం దాదాపు 14,000 గా ఉంది. అయితే ప్రభుత్వం అందించే పింఛన్ పొందాలంటే ట్రాన్స్‌జెండర్లు డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుండి సర్టిఫికేట్ పొందాలి. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మరియు ఓటరు కార్డులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. .

ట్రాన్స్‌జెండర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆసుపత్రుల్లో ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించాలని కూడా డిపార్ట్‌మెంట్ ప్రతిపాదించింది. ట్రాన్స్‌జెండర్లు ఎలాంటి వివక్షను ఎదుర్కోకుండా ప్రజలను కూడా చైతన్యవంతులను చేస్తున్నారు. ఏ కుల రిజర్వేషన్ల పరిధిలోకి రాని లింగమార్పిడి దారులకు వెనుకబడిన కేజిటరీ-2 ప్రయోజనాలు అందించబడతాయి. ట్రాన్స్‌జెండర్ రిజర్వేషన్‌పై సీఎం సోరెన్ స్పందిస్తూ.. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి గౌరవం లభించే విధంగా ఈ చర్య ఉందన్నారు. .ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తోందని, వారి అభీష్టం మేరకు నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన అన్నారు.

ప్రభుత్వం తీసుకున్న బృహత్తర నిర్ణయంపై ట్రాన్సజండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని గుర్తించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Also Read: Kushi Record : తమిళనాడులో ఈ ఇయర్ హయ్యెస్ట్ గ్రాసర్ తెలుగు మూవీగా “ఖుషి” రికార్డ్..