Site icon HashtagU Telugu

Vijayawada : సమ్మర్‌లో సింపుల్ ట్రిప్ దగ్గర్లో ప్లాన్ చేస్తున్నారా? అయితే విజయవాడ చుట్టు పక్కల అన్నీ చూశారా?

Tourist Places in and Around Vijayawada Plan Special Summer Trip

Tourist Places in and Around Vijayawada Plan Special Summer Trip

Vijayawada : సమ్మర్ వచ్చేసింది అంటే అందరికీ సెలవులు వచ్చినట్లే. పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఫ్యామిలీలను తీసుకొని ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. కొంతమంది బడ్జెట్ ని బట్టి ట్రిప్స్ వేసుకుంటారు. మీరు విజయవాడని, విజయవాడ చుట్టు పక్కల ఉన్న ప్రదేశాలని చూశారా? తక్కువ బడ్జెట్ లో రెండు రోజుల్లో అయిపోవాలి అనుకుంటే విజయవాడని ఇప్పటివరకు చూడలేదంటే విజయవాడ ట్రిప్ ప్లాన్ చేసుకోండి.

విజయవాడ సిటీలో ముఖ్యంగా మొదట చూడవలసినది కనకదుర్గమ్మ వారి ఆలయం, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజి, ఉండవల్లి గుహలు, విక్టోరియా మ్యూజియం, గుణదల మేరీ మాత చర్చి, భవాని ద్వీపం.. లాంటివి సిటీలోనే ఉంటాయి. భవాని ద్వీపం కృష్ణా నదిలో ఉన్న ద్వీపాలలో ఒకటి. అక్కడికి బోట్ సర్వీస్ ఉంటుంది. ప్రకృతి ఒడిలో సేద తీరాలి అనుకునేవారికి ఇది ఒక మంచి ప్లేస్.

ఇక విజయవాడ చుట్టు పక్కల చూస్తే.. కొండపల్లి కోట, మంగళగిరిలో పానకాల నరసింహస్వామి ఆలయం, అమరావతి బౌద్ధ స్థూపాలు, పంచారామాల్లో ఒకటైన అమరావతి అమరేశ్వర స్వామి ఆలయం, మచిలీపట్టణం వద్ద మంగినిపూడి బీచ్, పరిటాల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఆలయం ఉన్నాయి. ఇవన్నీ చూడటానికి, తిరగటానికి పర్యాటక ప్రదేశాలుగా ఎంతో బాగుంటాయి. ఎంతో పాపులర్ ప్లేసెస్ కూడా ఇవి. విజయవాడ ట్రిప్ వేస్తే సిటీలోనే కాక ఇవన్నీ కూడా కవర్ అయ్యేలా చూసుకోండి ఈ సమ్మర్ లో.

 

Also Read : SSMB29 : ఎయిర్ పోర్ట్‌లో మహేష్, రాజమౌళి.. వీడియో వైరల్..