Site icon HashtagU Telugu

Solar Eclipse 2024: ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం.. మరి భారత్‌లో కనిపిస్తుందా?

Solar Eclipse 2024

Solar Eclipse 2024

Solar Eclipse 2024: ఈరోజు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణంగా ఉండనుంది. అంతేకాదు ఎక్కు కాలం ఈ గ్రహణం ఉంటుంది. ఈ సందర్భంగా నాసా కూడా ఓ ప్రత్యేక ప్రయోగాన్ని నిర్వహించబోతోంది. ఈసారి సూర్యగ్రహణం 5 గంటల 10 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో ఆకాశంలో 4 నిమిషాల 11 సెకన్ల పాటు పూర్తిగా చీకటి ఉంటుంది. భారత దేశ కాలమాన ప్రకారం ఏప్రిల్ 8 రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9 తెల్లవారుజామున 2:22 గంటలకు ముగుస్తుంది. ఈ కారణంగా ఈసారి సూర్యగ్రహణం వ్యవధి 5 ​​గంటల 10 నిమిషాలు.

సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఈరోజు అంటే ఏప్రిల్ 8న సంభవించబోతోంది. మెక్సికో, ఉత్తర అమెరికా, కెనడా, జమైకా, ఐర్లాండ్, నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్, క్యూబా, డొమినికా, కోస్టారికా, పశ్చిమ యూరప్, ఫ్రెంచ్ పాలినేషియా, పసిఫిక్, అట్లాంటిక్ మరియు ఆర్కిటిక్‌లలో సూర్యగ్రహణం కనిపిస్తుంది. మెక్సికోలోని మజాటియన్ నగరంలో ఈ గ్రహణం మొదటగా కనిపించనుంది. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖపై ఉంటాయి. ఈ సమయంలో సూర్యుణ్ని నేరుగా చూడకూడదని, బైనాక్యులర్స్, టెలిస్కోప్ వంటి సాధనాల ద్వారా మాత్రమే చూడాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో 1982 లో సంపూర్ణ సూర్యగ్రహణం దర్శన మిచ్చింది. కాగా ఈ సూర్య గ్రహణం భారత్‌లో కనిపిస్తుందా అంటే లేదనే చెప్పాలి. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

We’re now on WhatsApp : Click to Join

నాసా శాస్త్రవేత్తలు ఈరోజు ప్రత్యేక ప్రయోగం చేయనున్నారు. వాస్తవానికి సూర్యగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని నాసా బృందం ఈ రోజు మూడు రాకెట్లను ప్రయోగించబోతోంది. ఒక రాకెట్‌ను గ్రహణానికి ముందు ప్రయోగించగా, మరొకటి సూర్యగ్రహణం సమయంలో ప్రయోగించబడుతుంది. అదే సమయంలో గ్రహణం ముగిసిన 45 నిమిషాల తర్వాత మూడో రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం ద్వారా వాతావరణంలో వచ్చే మార్పులను మూడుసార్లు నమోదు చేయాలని నాసా భావిస్తోంది.

Also Read: Pawan Kalyan : మరోసారి అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్.. పర్యటన రద్దు