Site icon HashtagU Telugu

Weather Information: టోర్నాడో, వ‌ర‌ద, సునామీ.. ఈ ప‌దాలు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి.. వాటి ఆర్థం ఏమిటో తెలుసా?

IMD Warns

Weather Information

దేశంలోని ప‌లు రాష్ట్రాల‌ను బిపోర్‌జోయ్ తుపాన్ హ‌డ‌లెత్తిస్తోంది. అరేబియా స‌ముద్రంలో తుపాన్ వేగంగా క‌దులుతోంది. ఈ తుపాన్ కార‌ణంగా మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. తుపాను ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. బిపోర్‌జోయ్ అంటే బెంగాలీ భాష‌లో విప‌త్తు అని అర్థం. తుపాన్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్ర‌, రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఎన్డీఆర్ఎఫ్ స‌హా, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యాయి. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌డానికి అనేక ప‌దాలు ఉప‌యోగిస్తారు. వాటిలో ట‌ర్నాడో, వ‌ర‌ద‌, సునామీ వంటి ప‌దాల‌ను మ‌నం వాడుతాం. అవి ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి? వాటి అర్థం ఏమిటి చూద్దాం.

డెరెకో :- ఇది అతిపొడ‌వైన స‌ర‌ళ‌రేఖ తుపాను. ఈ ప‌దం 19వ శ‌తాబ్దంలో ఉద్భ‌వించింది. డెరెకో అనేది లాటిన్ ప‌దం డైరెక్ట‌స్ నుండి ఉద్భ‌వించింది. దీనికి స్పానిష్ ఉచ్చార‌ణ కూడా జోడించ‌బ‌డింది. ఈ కార‌ణంగా దీనిని స్పానిష్ ప‌దం అనికూడా పిలుస్తారు.

టోర్నాడో (సుడిగాలి) :- మ‌నం సుడిగాలిని త‌ర‌చూ చూస్తుంటాం. గాలి తిరిగే వృత్తాన్ని సుడిగాలి అంటారు. ఇది స్పానిష్ ప‌దం ట్రోనార్, థండ‌ర్ నుండి ఉద్భ‌వించిందని చెబుతారు. ట్రోనార్ అంటే తిర‌గ‌డం. ఇది ఉరుము అనే ప‌దం నుండి ఉద్భ‌వించింద‌ని కూడా చెబుతారు. ఆర్ మ‌రియు ఓ క‌ల‌ప‌డం వ‌ల్ల దీనికి టోర్నాడో అనే పేరు వ‌చ్చింది.

వరద :- వ‌ర‌ద అనేది స‌హ‌జ‌మైన‌, అస‌హ‌జ‌మైన విప‌త్తు. భారీ వ‌ర్షం కార‌ణంగా వాగులు, న‌దులు పొంగిపొర్ల‌డం ద్వారా వ‌ర‌ద‌లు సంభ‌విస్తాయి. హిందీలో వ‌ర‌ద అంటే వ‌ర‌ద అని అర్ధం. ఇది డ‌చ్ ప‌దం వ్లోడ్ నుండి ఉద్భ‌వించింది. దీని మూలాలు జ‌ర్మ‌న్ భాషా ప‌దం ప్ల‌ట్‌, ఫ్రెంచ్ భాషా ప‌దం ప్లీట్‌, అంటే వ‌ర్షంతోకూడా సంబంధం క‌లిగి ఉండ‌వచ్చ‌ని నిపుణులు అంటున్నారు.

మంచు తుఫాను :- ఇది 1881లో అమెరికాలో విస్తృతంగా ఉప‌యోగించ‌బ‌డింది. బ్లిజ్ అనే ప‌దాన్ని 1700ల‌లో కూడా ఉప‌యోగించారు. అంటే భారీ వ‌ర్షంతో తుపాను అని అర్థం.

సునామీ:- స‌ముద్రంలో కొన్ని మీట‌ర్ల ఎత్తులో ఎగిసిప‌డే అల‌ల‌ను సునామీ అంటారు. జ‌ప‌నీస్ ప‌దం సునామీ వాతావ‌ర‌ణానికి సంబంధించిన స‌మాచారాన్ని ఇవ్వ‌డానికి కూడా ఉప‌యోగిస్తారు. ఇది 19వ శ‌తాబ్దంలో ఉద్భ‌వించింది. ఇందులో సు అంటే ఓడ‌రేవు, నామి అంటే అల అని అర్థం.

Cricketer KS Bharat: సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన టీమిండియా క్రికెట‌ర్ కోన శ్రీ‌క‌ర్ భ‌ర‌త్.. సీఎంకు జెర్సీ బ‌హుక‌ర‌ణ‌