Site icon HashtagU Telugu

Top 10 Viral Videos: 2022లో దుమ్ము లేపిన టాప్ 10 వైరల్ వీడియోస్ ఇవే!!

1111

Resizeimagesize (1280 X 720)

2022 సంవత్సరంలో నెటిజన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్త గా ఎంతోమంది సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు. సోషల్ మీడియా చూసేందుకు వెచ్చించే సమయం కూడా పెరిగింది. టిక్‌టాక్ నిషేధించబడినప్పటికీ.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లు, ఫేస్‌బుక్ వీడియోలలో నెటిజన్స్ ఎంతో సమయాన్ని గడుపుతున్నారు. 2022లో ఇండియా లో సోషల్ మీడియాలో వైరల్ అయిన టాప్ 10 వీడియోలను ఇయర్ ఎండ్ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం..

1.పాకిస్తానీ అమ్మాయి డ్యాన్స్

లతా మంగేష్కర్ పాడిన ” మేరా దిల్ యే పుకారే ఆజా” అనే పాట రీమిక్స్ వెర్షన్‌కు అయేషా అనే పాకిస్తానీ అమ్మాయి ఒక వివాహ రిసెప్షన్‌లో డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ లో వైరల్ అయింది. వదులుగా ఉండే ఆకుపచ్చ రంగు దుస్తులలో ఆమె అందమైన కదలికలు భారతదేశంలోని మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నాయి.  కత్రినా కైఫ్ వంటి ప్రముఖులు కూడా రీల్స్‌ను పోస్ట్ చేయడానికి ఈ ట్రెండింగ్ పాటను 2022లో వాడుకున్నారు.

 


2.క్విక్ స్టైల్ “కాలా చష్మా”

నార్వేకు చెందిన డ్యాన్స్ క్రూ
“క్విక్ స్టైల్” కాలా చష్మా పాటకు వేసిన స్టెప్పులతో కూడిన వీడియో వైరల్ అయింది. తమ క్రూలోని ఒక మెంబర్ పెళ్లిలో వాళ్ళు ఈ డ్యాన్స్ వేశారు. ఇది ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ అయింది. ఈ డ్యాన్స్ గ్రూప్ ప్రారంభంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తమ డ్యాన్స్ ప్రదర్శన యొక్క బిట్‌లను పోస్ట్ చేసింది. చురా కే దిల్ మేరా, సాదీ గాలి , తుమ్సే మిల్కే దిల్ కా వంటి పాటలపైనా వారు డ్యాన్స్ చేశారు.అనంతరం ఎంతోమంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు   వారి డ్యాన్స్ స్టయిల్ ను కాపీ కొట్టారు. శిల్పాశెట్టి, అక్షయ్ కుమార్ మరియు కత్రినా కైఫ్‌తో సహా చాలా మంది ప్రముఖులు వారి నృత్యాన్ని ఇష్టపడ్డారు. “కాలా చష్మా” డ్యాన్స్ ఫుల్ వీడియోకు యూట్యూబ్‌లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

 


3. ‘యే మేరా భాయ్ హై’

‘యే మేరా భాయ్ హై’ పాటకు ఇద్దరు చిన్న పిల్లలు కలిసి తీసిన రీల్ వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి ఫుల్ క్రేజీ వచ్చింది. ఈ వీడియోలో తోబుట్టువులు జరా మరియు జోహాన్ తమను తాము ఇంటర్నెట్‌కు పరిచయం చేసుకుంటున్నట్లు చూపించారు. “యే మేరీ బెహెన్ హై” అంటూ
స్పెక్స్ ధరించిన చిన్న పిల్లవాడు ఇందులో చివరగా చెప్పాడు.  దీంతో “యే మేరా భాయ్ హై, మెయిన్ ఇస్కీ బెహెన్ హన్,” చిన్న అమ్మాయి పునరుద్ఘాటిస్తుంది.

 


4. ‘నేను మిస్టర్ మెక్ ఆడమ్స్’

ప్రముఖ న్యూస్ యాంకర్, టైమ్స్ నౌ యొక్క ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ శివశంకర్ కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. ఒక లైవ్ షోలో ఆయన ఒక గెస్ట్ ను ఆగకుండా తిట్టారు. తాను ఒక వ్యక్తిని తిట్టబోయి మరో అతన్ని తిట్టానాన్ని చివర్లో ఆయన గుర్తిస్తారు.ఈ వీడియో క్లిప్ ట్విట్టర్‌లో వైరల్ అయింది.
ఉక్రెయిన్ ఇష్యూకు సంబంధించి Daniel McAdams అనే గెస్ట్ ను తిట్టబోయి Bohdan Nahaylo అనే అతన్ని యాంకర్ తిట్టడం వివాదాస్పదం అయింది. “డేనియల్ మెక్‌ఆడమ్స్, కొంచెం చిల్ పిల్ తీసుకోండి, నేను మిమ్మల్ని సంబోధించలేదు, విశ్రాంతి తీసుకోండి, ప్రశాంతంగా ఉండండి. మీరు ఉక్రేనియన్ల గురించి చాలా ఆందోళన చెందుతుంటే.. కంచె నుండి దిగి మీ బలగాలను పంపండి మరియు నేలపై బూట్లు వేయండి, ఇక్కడ భారతదేశంలో మాకు ఉపన్యాసాలు ఇవ్వకండి, ”అని యాంకర్ అన్నారు. దీనిపై మెక్‌ఆడమ్స్ స్పందిస్తూ.. “డియర్ హోస్ట్, నేను ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నువ్వు నన్ను ఎందుకు అరుస్తున్నావో తెలియదు” అన్నారు.తన తప్పును గుర్తించడంలో విఫలమైన యాంకర్.. “నేను నిన్ను తిట్టడం లేదు. నేను మిస్టర్ మెక్ ఆడమ్స్ గురించి మాట్లాడుతున్నాను” అని బదులిచ్చారు. దీంతో మెక్‌ఆడమ్స్ స్పందిస్తూ..”నేనే ఆ మిస్టర్ మెక్ ఆడమ్స్!” అని తెలిపారు.

5. ఛోటీ బచ్చి హో క్యా

టైగర్ ష్రాఫ్ చెప్పిన ” ఛోటీ బచ్చి హో క్యా ” డైలాగ్ ఏప్రిల్ 2022లో ట్విట్టర్‌లో వైరల్ అయింది. ‘ఛోటీ బచ్చి హో క్యా?’ అనే డైలాగ్ టైగర్ ష్రాఫ్ యొక్క 2014 చిత్రం హీరోపంతి లోనిది. ఇంతకాలం తర్వాత ఇప్పుడు అది ఎందుకు వైరల్ అయింది?  అంటే.. ఒక మిమిక్రీ కళాకారుడు టైగర్ ష్రాఫ్ డైలాగ్‌ను అనుకరిస్తూ సినిమాలోని రెండు డైలాగ్‌లను హేరా ఫేరీ సీన్‌తో కలిపి తయారు చేశాడు.  హీరోపంతి 2 విడుదలకు కొన్ని రోజుల ముందు.. ‘ఛోటీ బచ్చి హో క్యా?’ రీల్ ను ఆ మిమిక్రీ కళాకారుడు ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేశాడు. ఇది చాలా వైరల్ అయింది.

6. కచ్ఛ బాదం

ఫిబ్రవరిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్ అనే వేరుశెనగ విక్రేత తన వేరుశెనగలను విక్రయించడానికి “కచ్ఛ బాదం” పేరుతో సూపర్ క్యాచీ జింగిల్‌ను కంపోజ్ చేశారు. అది సంచలనంగా మారింది. దీని స్పూర్తితో సంగీతకారుడు నజ్ము రీచాట్ ఈ పాట యొక్క రీమిక్స్‌ని సృష్టించాడు .ఇది కూడా ఇన్‌స్టాగ్రామ్‌ లో హల్ చల్ చేసింది.

7. కిలీ పాల్ నీమా పాల్‌..లిప్ సింక్

టాంజానియా ఇన్‌ఫ్లుయెన్సర్ కిలీ పాల్ తన సోదరి నీమా పాల్‌తో కలిసి షేర్షా పాట ‘రాతాన్ లంబియాన్’కి లిప్ సింక్ చేశారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ లో వైరల్ అయింది. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కూడా దీన్ని లైక్ చేశారు.కిలీ పాల్ ను టాంజానియాలోని భారత హైకమిషన్ సత్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో కూడా దీని గురించి ప్రస్తావించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 5 మిలియన్ల మంది ఫాలోవర్లను కిలీ పాల్ కలిగి ఉన్నాడు.

8. “పుష్ప” పాటకు వధువు తండ్రి డ్యాన్స్

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలోని ప్రసిద్ధ పాట ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ సోషల్ మీడియాలో అదుర్స్ అనిపించింది.
ఒక వధువు తండ్రి కిల్లర్ మూవ్స్‌తో ఈ పాటకు అదిరే స్టెప్పులు వేశాడు. ఈ వీడియో వైరల్ అయింది. ఇతగాడి డ్యాన్స్ చూసి పెళ్లికి వచ్చిన అతిథులు బిగ్గరగా అరవడాన్ని వీడియోలో వినొచ్చు. ఈ నృత్యానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.

9. యష్‌రాజ్ ముఖాటే వీడియో

సంగీత నిర్మాత యష్‌రాజ్ ముఖాటే చేసిన ఒక వీడియోకు యూట్యూబ్‌లో 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఒకప్పటి బిగ్ బాస్ కంటెస్టెంట్ షెహ్నాజ్ గిల్ యొక్క ‘సచ్ ఎ బోరింగ్ డే’ డైలాగ్‌, పావ్రీ అమ్మాయి డైలాగ్‌, ‘టామీ’ డైలాగ్‌లను రీమిక్స్ చేసి ఈ వీడియో చేశారు.జనవరి 2022లో ఇది వైరల్ గా మారింది.

10. జబ్ వాక్ కర్తే హై ట్యాబ్ టైమ్ నహీ దేఖ్తే

ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ తేజస్వి ప్రకాష్ “జబ్ వాక్ కర్తే హై ట్యాబ్ టైమ్ నహీ దేఖ్తే…” అంటూ షోలో వదిలిన ఫన్నీ డైలాగ్ వీడియో వైరల్ అయింది. నాగిన్ సీరియల్6వ సీజన్ లో ఈమె ప్రధాన నటి పాత్రను పోషించింది. “జబ్ వాక్ కర్తే హై ట్యాబ్ టైమ్ నహీ దేఖ్తే…” డైలాగ్ కు ఎంతో క్రేజ్ వచ్చింది. చివరకు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ డైలాగ్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు రీక్రియేట్ చేశారు.