Gold Reserves : ఓ వైపు యుద్ధాలు.. మరోవైపు గోల్డ్ రిజర్వులు.. ఏం జరుగుతోంది ?

ప్రపంచంలోని  చాలావరకు దేశాలకు కేంద్ర బ్యాంకులు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - June 6, 2024 / 11:17 AM IST

Gold Reserves : ప్రపంచంలోని  చాలావరకు దేశాలకు కేంద్ర బ్యాంకులు ఉన్నాయి. అవి బంగారాన్ని కొని తమ దేశ ఖజానాలో నిల్వ చేస్తుంటాయి. ఈవిధంగా నిల్వ అయిన బంగారం రిజర్వ్ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే టాప్-10 లిస్టులో ఏయే దేశాలు ఉంటాయి ? అనేది  ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు అగ్రరాజ్యం అమెరికా వద్ద ఉన్నాయి.  ఆ దేశం వద్ద 8,133.46 టన్నుల బంగారం రిజర్వ్ ఉంది.  తర్వాతి స్థానంలో ఉన్న జర్మనీ   వద్ద 3,352.65 టన్నుల గోల్డ్, ఇటలీ  వద్ద 2,451.84 టన్నుల గోల్డ్ ఉంది.  తదుపరి స్థానాల్లో వరుసగా ఫ్రాన్స్  (2,436.88 టన్నులు), రష్యా   (2,332.74 టన్నులు) ఉన్నాయి.  ఇక మన పొరుగు దేశం చైనా బంగారం నిల్వల పరంగా ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. దాని వద్ద 2,262.45 టన్నుల గోల్డ్ ఉంది. ఇక అత్యంత ధనిక ఐరోపా దేశం స్విట్జర్లాండ్  వద్ద 1,040.00 టన్నుల బంగారం ఉంది.  అణు బాంబులు పడిన తర్వాత కూడా ప్రగతిలో దూసుకుపోయిన  జపాన్ దేశం వద్ద ప్రస్తుతం  845.97 టన్నుల బంగారం రిజర్వ్ ఉంది. ఇక మన ఇండియా ఈ లిస్టులో 9వ స్థానంలో ఉంది. చైనాతో పోలిస్తే మన దేశం వద్ద తక్కువ గోల్డ్ రిజర్వ్ ఉంది. భారత్ వద్ద ప్రస్తుతం 822.09 టన్నుల బంగారం ఉంది. నెదర్లాండ్స్  వద్ద 612.45 టన్నుల గోల్డ్ రిజర్వ్(Gold Reserves) ఉంది.

Also Read :Ministries Race : ఆ ఆరు మంత్రి పదవులు అడగొద్దు.. ఎన్డీయే మిత్రపక్షాలకు బీజేపీ నో !

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల బ్రిటన్ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారాన్ని తీసుకొచ్చింది. 1990వ దశకంలో ఆర్థిక సంక్షోభం టైంలో మన దేశం ఆ బంగారాన్ని బ్రిటన్‌లోని బ్యాంక్ ఆఫ్ లండన్‌లో తనఖా పెట్టింది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బంగారాన్ని విడిపించుకొని దేశానికి తీసుకొచ్చింది.
  • ముంబై, నాగ్‌పూర్‌‌లో ఉన్న ఆర్‌బీఐ  కార్యాలయాల్లో ఈ 100 టన్నుల గోల్డ్‌ను ఆర్‌బీఐ దాచిపెట్టింది.
  • 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి భారతదేశం వద్ద దాదాపు 800 టన్నుల బంగారం ఉంది. ఇందులో 500 టన్నులు విదేశాల్లో, 300 టన్నులు భారత్‌లో ఉంచారు.
  • గత కొన్నేళ్లుగా  ఆర్‌బీఐ పెద్దఎత్తున బంగారం కొంటోంది. ఇలాగే గోల్డ్ కొనుగోళ్లను భారత్ కంటిన్యూ చేస్తే.. త్వరలోనే జపాన్‌ను దాటేసే అవకాశం ఉంటుంది.
  • ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు రష్యా, ఉక్రెయిన్.. మరోవైపు ఇజ్రాయెల్ – హమాస్ భీకరంగా తలపడుతున్నాయి. ఈ రెండు యుద్ధాల్లోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా, రష్యాలు పాల్గొంటున్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలిస్తోంది. ఇజ్రాయెల్‌కు అమెరికా ఆయుధాలిస్తోంది. రానున్న రోజుల్లో ఈ యుద్ధాలు ప్రపంచ యుద్ధంగా మారొచ్చని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
  • ఇలాంటి సంక్షోభ వాతావరణాల్లో ఆర్థిక వ్యవస్థలు బలంగా నిలబడాలంటే తగినన్ని గోల్డ్ రిజర్వులు అవసరం. అవి ఉంటే కరెన్సీ పతనం కాకుండా కాపాడుకోవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆటంకం లేకుండా అమలు చేయొచ్చు.

Also Read :Virat Kohli: విరాట్ కోహ్లీ రికార్డు.. ప్ర‌పంచంలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ ఉన్న రెండో ఆట‌గాడిగా గుర్తింపు..!