Millionaires: అత్యధిక మిలియనీర్లున్న టాప్-10 నగరాలివే..

ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో మిలియనీర్లు ఉన్న టాప్ 10 నగరాల లిస్ట్ రిలీజ్ అయింది. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి బిలియనీర్లు ఉన్నప్పటికీ..

ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో మిలియనీర్లు (Millionaires) ఉన్న టాప్ 10 నగరాల లిస్ట్ రిలీజ్ అయింది. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి బిలియనీర్లు ఉన్నప్పటికీ.. మన ఇండియా నుంచి ఒక్క సిటీ కూడా మిలియనీర్స్ లిస్ట్ కు ఎంపిక కాలేదు. ఈ ర్యాంకింగ్‌లను హెన్లీ గ్లోబల్ సిటిజన్ రిపోర్ట్ విడుదల చేసింది. అత్యధిక సంఖ్యలో మిలియనీర్లు ఉన్న నగరంగా న్యూయార్క్ 1వ స్థానంలో నిలిచింది. ఈ సిటీలో 3,45,600 అధిక నికర విలువ గల వ్యక్తులు , 737 మంది సెంటీ మిలియనీర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది నికర విలువ $100 మిలియన్లు (Millionaires) లేదా అంతకంటే ఎక్కువ.  న్యూయార్క్ లో 59 మంది బిలియనీర్లు కూడా ఉన్నారు.ఈ జాబితాలో సిడ్నీ, హాంకాంగ్, ఫ్రాంక్‌ఫర్ట్, టొరంటో, జ్యూరిచ్‌ సిటీలు కూడా టాప్ 15లో ఉన్నాయి.

టోక్యో:

అత్యధిక మిలియనీర్లు ఉన్న టాప్ 10 నగరాల జాబితాలో రెండో నగరం టోక్యో. ఇక్కడ 263 సెంటీ మిలియనీర్లు ఉన్నారు. 12 మంది బిలియనీర్లతో పాటు 3,04,900 మంది మిలియనీర్లు ఉన్నారు.

శాన్ ఫ్రాన్సిస్కో:

అత్యధిక మిలియనీర్లు ఉన్న టాప్ 10 నగరాల జాబితాలో మూడో స్థానంలో శాన్ ఫ్రాన్సిస్కో ఉంది. ఇక్కడ 2,76,400 మంది మిలియనీర్లు ఉన్నారు. వీరిలో 623 మంది సెంటిమిలియనీర్లు కాగా, 62 మంది బిలియనీర్లు.

లండన్:

అత్యధిక మిలియనీర్లు ఉన్న టాప్ 10 నగరాల జాబితాలో నాలుగో స్థానంలో లండన్‌ ఉంది.ఇక్కడ 2,72,400 మంది మిలియనీర్లు ఉన్నారు. ఈ నగరంలో 9,210 మంది మల్టీ – మిలియనీర్లు, 406 సెంటీ – మిలియనీర్లు, 38 బిలియనీర్లు ఉన్నారు.

సింగపూర్‌:

అత్యధిక మిలియనీర్లు ఉన్న టాప్ 10 నగరాల జాబితాలో ఐదో స్థానంలో సింగపూర్‌ ఉంది. ఇక్కడ 2,49,800 మంది మిలియనీర్లు, 8,040 మంది మల్టీ మిలియనీర్లు, 336 మంది సెంటి మిలియనీర్లు, 26 మంది బిలియనీర్లు ఉన్నారు.

లాస్ ఏంజిల్స్:

అత్యధిక మిలియనీర్లు ఉన్న టాప్ 10 నగరాల జాబితాలో ఆరో స్థానంలో లాస్ ఏంజెల్స్ ఉంది. ఇక్కడ 192,400 మంది మిలియనీర్లు, 8,590 మంది మల్టీ మిలియనీర్లు, 393 మంది సెంటీ మిలియనీర్లు, 34 మంది బిలియనీర్లు ఉన్నారు.

చికాగో:

అత్యధిక మిలియనీర్లు ఉన్న టాప్ 10 నగరాల జాబితాలో ఏడో స్థానంలో చికాగో ఉంది. ఇక్కడ 160,100 మంది మిలియనీర్లు, 7,400 మంది మల్టీ మిలియనీర్లు, 340 మంది సెంటీ మిలియనీర్లు , 28 మంది బిలియనీర్లు ఉన్నారు.

హ్యూస్టన్:

అత్యధిక మిలియనీర్లు ఉన్న టాప్ 10 నగరాల జాబితాలో ఎనిమిదో స్థానంలో హ్యూస్టన్ ఉంది.ఇక్కడ 1,32, 600 మంది మిలియనీర్లు, 6,590 మంది మల్టీ మిలియనీర్లు, 314 మంది సెంటి మిలియనీర్లు, 25 మంది బిలియనీర్లు ఉన్నారు.

బీజింగ్:

అత్యధిక మిలియనీర్లు ఉన్న టాప్ 10 నగరాల జాబితాలో తొమ్మిదో స్థానంలో బీజింగ్ ఉంది.ఇక్కడ 1,31,500 మంది మిలియనీర్లు, 6,270 మంది మల్టీ మిలియనీర్లు, 363 మంది సెంటీ మిలియనీర్లు, 44 మంది బిలియనీర్లు ఉన్నారు.

షాంఘై:

అత్యధిక మిలియనీర్లు ఉన్న టాప్ 10 నగరాల జాబితాలో పదో స్థానంలో షాంఘై ఉంది.ఇక్కడ 1,30,100 మంది మిలియనీర్లు, 6,180 మంది మల్టీ మిలియనీర్లు, 350 మంది సెంటీ మిలియనీర్లు, 42 మంది బిలియనీర్లు ఉన్నారు.

Also Read:  Hormone Imbalance: హార్మోన్ ఇమ్‌బ్యాలెన్స్ సమస్యతో బాధపడుతున్నారా?