Saddula Bathukamma : ఇవాళ సద్దుల బతుకమ్మ. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో చివరిరోజు ఇదే. ఈరోజు మహిళలు 9 దొంతరలుగా బతుకమ్మను పేరుస్తారు. ఇందుకోసం తంగేడు, గునుగు, కట్ల, చేమంతి, బంతి, మల్లె, మొల్ల, మొగలి, సంపెంగ, కలువ, తామర వంటి పూలను వాడుతారు. బతుకమ్మపై పసుపుతో గౌరమ్మను తయారు చేసి పెడతారు. సాంప్రదాయబద్దంగా గౌరమ్మను పూజించి, పసుపును ఆడవారు వారి చెంపలకు రాసుకుంటారు. అంతా ఒకచోట చేరి ఆడిపాడి బతుకమ్మలను గంగమ్మలో నిమజ్జనం చేస్తారు. గ్రామాల్లో పెద్ద బతుకమ్మ రోజున పులిహోర, చిద్రాన్నం, నువ్వులసద్ది, కొబ్బరిసద్ది, పెరుగన్నం వంటి వివిధ రకాల సద్దులు చేస్తారు. అందుకే చివరి రోజు బతుకమ్మ వేడుకలను సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma) అని పిలుస్తారు.
బతుకమ్మ గాథలు
- మరో గాథ ఏమిటంటే.. చోళ రాజైన ధర్మాంగద ,సత్యవతి కుమార్తె పేరు బతుకమ్మ. ధర్మాంగదుడు తన 100 మంది కుమారులను యుద్ధంలో కోల్పోయాడని అంటారు.ధర్మాంగదుడు, సత్యవతి దంపతులు లక్ష్మీ దేవిని ప్రార్థించగా వారికి ఒక ఆడబిడ్డ పుట్టింది. రుషులందరూ వచ్చి ఆమెకు ‘‘బతుకమ్మ ,శాశ్వతంగా జీవించు’’ అని అమరత్వాన్ని ప్రసాదించారు. అప్పటి నుంచి బతుకమ్మను ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెబుతారు.
- బతుకమ్మకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం.. గౌరీ దేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తరువాత అలసటతో ‘అశ్వయుజ పాడ్యమి’ నాడు నిద్రపోయింది. దీంతో భక్తులు ఆమెను మేల్కొల్పమని ప్రార్థించారు. ఈ నేపథ్యంలో పూజలు చేయగా ఆమె దశమి నాడు మేల్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇవాళ సద్దుల బతుకమ్మ వేడుకల కోసం ట్యాంక్‌బండ్‌పై భారీ ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్‌ను విద్యుత్ లైట్లతో అలంకరించారు. బతుకమ్మ ఆటల తర్వాత నిమజ్జనం కోసం నీటి కొలనులను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు షీ టీమ్స్‌తోపాటూ వందల మంది పోలీసుల నిఘా ఉండబోతోంది. ఈరోజు ట్యాంక్‌బండ్‌పై ఉదయం 11 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అందువల్ల వాహనదారులు ఆంక్షలు ఉన్న సమయంలో.. ట్యాంక్‌బండ్‌పై వాహనాలు నడిపే ఛాన్స్ ఉండదు. వారు వేరే మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్, కర్బలా మైదాన్ నుంచి వచ్చే వాహనాలు, ట్యాంక్ బండ్ పైనుంచి వెళ్లడానికి వీలు లేదు.
Also Read: Gold Rates: ధరలు ఇలా ఉంటే బంగారం కొనటం కష్టమే.. రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.